
గుంటూరు కారం నెక్స్ట్ షెడ్యూల్ లొకేషన్ ఎక్కడో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
మహేష్ బాబు అభిమానులకు గుంటూరు కారం గ్లింప్స్ విడుదల కాగానే కడుపు నిండిపోయింది. తమ హీరోను ఊరమాస్ గా చూడాలని, పోకిరి తాలూకు వైబ్రేషన్స్ రావాలని ఎన్నో రోజులుగా కోరుకున్నారు.
ఆ కోరికను గుంటూరు కారం సినిమా నెరవేర్చబోతుందని గ్లింప్స్ ద్వారా అర్థమైపోయింది. గ్లింప్స్ లో కనిపించిన మహేష్ లుక్, పలికిన డైలాగ్, చేసిన ఫైట్.. అన్నీ అభిమానులను ఉర్రూతలూగించాయి.
దాంతో, ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు అనుకుంటున్నారు. సినిమా రిలీజ్ కావడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. ప్రస్తుతం ఈ సినిమా మరో షెడ్యూల్ మొదలు కానుందని సమాచారం.
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గుంటూరు కారం షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుందట.
Details
జూన్ 12నుండి షూటింగ్ మొదలు
నెలరోజుల పాటు సాగే ఈ షెడ్యూల్, జూన్ 12వ తేదీ నుండి మొదలవుతుందని వినిపిస్తోంది. ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు, పూజా హెగ్డే, శ్రీలీల పై కీలక ఎపిసోడ్లను చిత్రీకరించనున్నారట.
యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో యాక్షన్ సీన్లు ఎక్కువగా ఉండనున్నాయని సమాచారం.
హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాకు ఎస్ రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు.
2024 జనవరి 13వ తేదీన గుంటూరు కారం సినిమాను విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది.