Guntur Kaaram: త్రివిక్రమ్ పుట్టిన రోజున 'గుంటూరు కారం' దమ్ మసాలా ఫుల్ సాంగ్ రిలీజ్
సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'గుంటూరు కారం'. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచేస్తున్నారు. ఈ సినిమాలోని మొదట పాట 'దమ్ మసాలా' ప్రోమోను ఇప్పటికే విడుదల చేసిన చిత్ర బృందం.. ఫుల్ సాంగ్‌ను దర్శకుడు త్రివిక్రమ్ పుట్టిన రోజు(నవంబర్ 7)న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మూవీని సంక్రాంతి కానుకగా, జనవరి 12, 2024న విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. 'దమ్ మసాలా' పాట లీకై.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసింది. ఇది జరిగిన వెంటనే మహేష్ అభిమానుల విజ్ఞప్తి మేరకు మొదటి పాటను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.
వరుస అప్డేట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న మేకర్స్
'దమ్ మసాలా' ప్రోమో ఆదివారం విడుదలైంది. ఈ ప్రోమో సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. 'దమ్ మసాలా' పాటను సంజిత్ హెగ్డే, థమన్ పాడారు. రామ జోగయ్య శాస్త్రి ఈ పాట రాశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. ఈ మూవీలో మహేష్ బాబు సరసన టాలీవుడ్ సెన్షేషనల్ శ్రీలీల నటించింది. వినోదం ప్రధానాంశంగా, మెసేజ్ ఉండేలా ఈ సినిమాను త్రివిక్రమ్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులకు ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర బందం వరుసగా అప్‌డేట్‌లు ఇచ్చే అవకాశం ఉంది.