
Guntur Kaaram trailer: 'ఆట చూస్తావా?'.. 'గుంటూరు కారం' ట్రైలర్ వచ్చేసింది.. డైలాగ్స్ అదుర్స్
ఈ వార్తాకథనం ఏంటి
మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'గుంటూరు కారం' ట్రైలర్ వచ్చేసింది.
ఆదివారం రాత్రి 9:09గంటలకు ట్రైలర్‌ను విడుదల చేశారు.
థియేట్రికల్ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
మహేష్ బాబు శైలిలో డైలాగ్ డెలివరీ.. త్రివిక్రమ్ స్టైల్ డైలాగులతో ట్రైలర్ ఆసాంతం ఆకట్టుకుంది.
'ఆట చూస్తావా?', 'గుంటూరు కారం చూడగానే ఎర్రగా కనిపిస్తుంది.. ఒక్కసారి నాలికకు తాకితే కంట్లో కారేది నీళ్లే', 'ఆడొక బ్రేకులు లేని లారీ.. ఎవడు ఆపుతాడు' లాంటి డైలాగులు హైలెట్‌గా నిలిచాయి.
హైదరాబాద్‌లోని సుదర్శన్ 35ఎంఎంలో ట్రైలర్‌ను లాంచ్ చేశారు. అభిమానుల సందోహం మధ్య ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ యాక్షన్ ఎంటర్‍టైన్‌మెంట్ శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గుంటూరు కారం మేకర్స్ ట్వీట్
అబ్బా అబ్బా అబ్బా…..@urstrulyMahesh 🦁🦁🔥🔥https://t.co/oe7Tz6S4Hc#GunturKaaramOnJan12th #GunturKaaram
— Guntur Kaaram (@GunturKaaram) January 7, 2024