తదుపరి వార్తా కథనం

Guntur Kaaram: గుంటూరు కారం టీంకి గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 09, 2024
04:11 pm
ఈ వార్తాకథనం ఏంటి
మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కానుంది.
ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మేకర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది.
తెలంగాణ ప్రభుత్వం సింగిల్ స్క్రీన్‌లకు రూ. 65,మల్టీప్లెక్స్‌లకు రూ.100 చొప్పున పెంచుకోవచ్చని జీవో ఇచ్చింది.
ఈ పెంపుదల ఒక వారం,అంటే జనవరి 12 నుండి జనవరి 18 వరకు మాత్రమే వర్తిస్తుంది. అలాగే నైజాంలో మొదటి వారానికి రోజుకి ఆరు షోలు వేసుకునేలా పర్మిషన్ ఇచ్చింది.
విడుదల రోజున తెల్లవారుజామున 1:00 గంటల నుండి బెనిఫిట్ షోల ప్రదర్శనకు కూడా ప్రభుత్వం అనుమతించింది.
త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల,మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ స్వరాలు సమకూర్చారు.