
Hanuman- Guntur Kaaram: గుంటూరు కారం, హనుమాన్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఈ సంక్రాంతి తేజ సజ్జాదే!
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం (Guntur Kaaram collections) తేజ సజ్జా సూపర్ హీరో పాత్ర పోషించిన 'హను-మాన్' సినిమాలు సంక్రాంతి కానుకగా.. శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల నుంచి మిశ్రమ రివ్యూలను అందుకుంది.
తాజాగా మేకర్స్ మొదటిరోజు కలెక్షన్లను వెల్లడించారు. గుంటూరు కారం ప్రపంచవ్యాప్తంగా రూ.94 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
ఒక ప్రాంతీయ చిత్రానికి ఇది ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్ అని కూడా మేకర్స్ పేర్కొన్నారు.
మిక్స్‌డ్ టాక్ వచ్చిన ఈ సినిమా రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి.
హనుమాన్
చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన 'హమమాన్]
చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం 'హనుమాన్ (Hanu-Man collections)'. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా అంచనాలను అధిగమించింది.
గుంటూరు కారంతో పోటీ పడి విడుదలైనపట్టికీ, ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఈ మూవీ తొలిరోజు కలెక్షన్స్‌ను సనీ విశ్లేషకులు అంచనా వేశారు. ఈ సినిమాను రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.
అయితే ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.21 కోట్లు రాబట్టినట్లు అంచనా.
త్వరలో ఈ మూవీకి థియేటర్ల పెరగనున్న నేపథ్యంలో కలెక్షన్లు కూడా మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ మూవీ నైజాంలో మొదటి రోజున రూ.4.90 కోట్ల గ్రాస్ (జిఎస్‌టితో సహా) రాబట్టంది. దీంతో తొలిరోజే డిస్ట్రిబ్యూటర్లకు తొలిరోజు 50 శాతం పెట్టుబడిని రికవరీ అయ్యింది.