Virosh Wedding: హల్దీతో హోలీ మజా.. విజయ్-రష్మిక పెళ్లి వేడుకల్లో సినీ తారల సందడి
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో అందరూ ఇష్టపడే క్యూట్ జంట విజయ్-రష్మికల పెళ్లి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు (ఫిబ్రవరి 26) ఉదయం 10 గంటల 10 నిమిషాలకు విజయ్ రష్మిక మెడలో మూడు మూళ్లు వేయనున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న మెమొంటోస్ హోటల్ ఈ శుభవివాహానికి వేదికగా మారింది. ఇప్పటికే బారాత్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయం తెలుగు సంప్రదాయం ప్రకారం పెళ్లి కార్యక్రమం జరగనుండగా, సాయంత్రం 4 గంటల తర్వాత కొడవ (కన్నడ) ఆచార ప్రకారం మరోసారి వివాహ వేడుక నిర్వహించనున్నారు.
వివరాలు
హల్దీ సంబరాలకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసిన ఆషికా రంగనాథ్
బుధవారం సాయంత్రం హల్దీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. టాలీవుడ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. హల్దీ సంబరాలకు సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, "ఇది హల్దీ కాదు... హోలీ ముందే వచ్చేసింది" అంటూ సరదాగా కామెంట్ చేశారు. ఇదే వివాహ వేడుకల కోసం హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ కూడా ఉదయ్‌పూర్ చేరుకున్నట్లు సమాచారం. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలను చూస్తే, హల్దీ కార్యక్రమంలో ఆమె కూడా పాల్గొన్నట్లు స్పష్టమవుతోంది.
వివరాలు
మార్చి 4న రిసెప్షన్
ఈ పెళ్లి వేడుకల కోసం దర్శకుడు తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా, టాలీవుడ్ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తదితర ప్రముఖులు ఇప్పటికే ఉదయ్‌పూర్‌కు చేరుకున్నారు. ఈ రోజు లేదా రేపటిలోగా వారు సోషల్ మీడియా వేదికగా కొత్త జంట విజయ్ దేవరకొండ-రష్మికలకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెట్టే అవకాశముంది. వివాహానికి సంబంధించిన ఫొటోలు కూడా విడుదల చేయడం ఖాయం. ఇక మార్చి 4న హైదరాబాద్‌లో సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల కోసం భారీ స్థాయిలో రిసెప్షన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.