తదుపరి వార్తా కథనం

Hanuman Trailer Release : హనుమాన్ ట్రైలర్ వచ్చేసింది.. గూస్ బంప్స్ తెప్పిస్తోంది
వ్రాసిన వారు
TEJAVYAS BESTHA
Dec 19, 2023
11:35 am
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్'లో తొలి సూపర్ హీరో సినిమాగా వస్తున్న హను-మాన్ ట్రైలర్ వచ్చేసింది. ఈ చిత్రంలో తేజ సజ్జా కథనాయకుడిగా నటించారు.
దీన్ని ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్ ఆకట్టుకున్నాయి. 2024 జనవరి 12న హనుమాన్ సినిమా 11 భాషల్లో విడుదలైంది.
మంగళవారం హనుమాన్ కి ప్రీతికరమైన రోజు సందర్భంగా ట్రైలర్ ను రిలీజ్ చేసినట్లు చిత్ర నిర్మాణ బృందం వెల్లడించింది.
యూనివర్సల్ కథాంశంతో అత్యాధునిక సాంకేతికత విలువలతో తెరకెక్కుతున్న హనుమాన్ ట్రైలర్ 19 ఏఎంబీ సినిమాస్ స్క్రీన్ 1లో ఉదయం 10 గంటలకు లాంఛ్ చేశారు.
ఓ చేతిలో కత్తి, మరో చేతిలో గొడ్డలితో సరికొత్త వేషధారణలో,వేటాడేందుకు వెళ్తున్న హనుమాన్ విజువల్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గూస్ బంప్స్ తెప్పిస్తున్న హనుమాన్ ట్రైలర్
Hope you like it 😊https://t.co/9c7OzMUJ1O#JaiHanuman 🙏🏽 #HanuManTrailer
— Prasanth Varma (@PrasanthVarma) December 19, 2023