Page Loader
Pushpa 2 : లుంగిలో భన్వర్ సింగ్ షెకావత్.. నయా పోస్టర్ రిలీజ్
లుంగిలో భన్వర్ సింగ్ షెకావత్.. నయా పోస్టర్ రిలీజ్

Pushpa 2 : లుంగిలో భన్వర్ సింగ్ షెకావత్.. నయా పోస్టర్ రిలీజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 08, 2024
04:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ సినిమా 'పుష్ప ది రూల్'. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా, నేషనల్ క్రష్ రష్మిక మంధాన హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి రిలీజైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. ఈ సినిమాలో విలన్‌గా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. తాజాగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫహద్ ఫాసిల్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Details

 డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్

ఈ పోస్టర్ షెకావత్ సార్ గుండీలు విప్పేసిన ఖాకీ చొక్కా వేసుకొని, లుంగీతో ఓ చేతిలో గొడ్డలి, మరో చేతిలో తుపాకి పట్టుకొని కనిపించాడు. ఎర్రచందనం స్మగ్లర్ల ఆటకట్టించబోతున్నట్లు తాజా లుక్‌లో అర్థమవుతోంది. ఇప్పటికే అల్లు అర్జున్ పుష్ప‌రాజ్‌గా కత్తి పట్టుకొని ఊరమాస్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై అంచనాలను పెంచేశాడు. పుష్ప-2 చిత్రాన్ని 2024 డిసెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.