హ్యాపీ బర్త్ డే మణిశర్మ: ఆయన సంగీతం అందించిన 5 బెస్ట్ సినిమాలు
ఈ వార్తాకథనం ఏంటి
స్వరబ్రహ్మ అంటూ అభిమానంగా పిలుచుకునే మణిశర్మ పుట్టినరోజు ఈరోజు. తెలుగు సినిమాల్లో ఆయన సంగీతానికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.
మెలోడీ సాంగ్స్ చేయాలంటే మణిశర్మ మాత్రమే అని చెప్పుకునేవారు ఎంతోమంది ఉన్నారు.
59వ సంవత్సరంలోకి మణిశర్మ అడుగుపెడుతున్న ఈ సందర్భంలో ఆయన సంగీతం అందించిన కొన్ని తెలుగు సినిమాల గురించి మాట్లాడుకుందాం.
ఖుషి (2001):
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఖుషి సినిమాను ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ గానీ, పాటలు గానీ భీభత్సంగా హిట్ అయ్యాయి.
అమ్మాయే సన్నగా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, చెలియా చెలియా పాటలను ఇప్పటికీ వింటుంటారు.
Details
నేపథ్య సంగీతంతో దుమ్ము దులిపిన సినిమాలు
ఇంద్ర (2002)
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఈ చిత్రంలోని సంగీతాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. మణిశర్మ స్వరాలకు చిరంజీవి వేసిన వీణ స్టెప్ ఎంత పాపులరో చెప్పల్సిన పనిలేదు.
అలాగే, ఈ చిత్రంలో నేపథ్య సంగీతం వేరే లెవెల్లో ఉంటుంది. ఎలివేషన్ సీనలలో మణిశర్మ విశ్వరూపం చూపించాడు.
ఒక్కడు(2003)
మహేష్ బాబు హీరోగా వచ్చిన ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఆ సినిమా అంత పెద్ద హిట్ కావడానికి కారణం అందులోని పాటలు ప్రధాన కారణం.
చెప్పవే చిరుగాలి..చల్లగా ఎదగిల్లి, నువ్వేమాయ చేసావో గానీ వంటి పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.
Details
మహేష్ బాబు సినిమాలకు మణిశర్మ మర్చిపోలేని సంగీతం
అతడు (2005):
త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మంచి మెలోడీస్ ఉన్నాయి. అయితే ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ కి మంచి పేరొచ్చింది.
విలక్షణమైన సంగీతం, సౌండ్ తో కొత్తగా ఉంటుంది అతడు టైటిల్ సాంగ్. అలాగే పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి అనే పాటకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.
పోకిరి (2006)
మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాకు మ్యూజిక్ ప్రధాన బలం. పూరీ టేకింగ్ ఎంత వేగంగా పరుగులు పెడుతుందో మ్యూజిక్ కూడా అంత బాగుంటుంది. ఈ సినిమాలో ప్రతీ పాట హిట్టే.