Happy Birthday Mahesh Babu: ఇప్పటి వరకు రీమేక్ చేయని మహేష్ కెరీర్లోని ఆసక్తికరమైన విషయాలు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా వెలుగొందుతున్న మహేష్ బాబు, ఆగస్టు 9వ తేదీన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ ఏడాది 48వ పుట్టినరోజును జరుపుకుంటున్న మహేష్, ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు. గుంటూరు కారం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్నాడు. అయితే పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు కెరీర్లోని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. మేడమ్ టుస్సాడ్స్ లో తొలి తెలుగు హీరో మైనపు బొమ్మ: మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మహేష్ బాబు మైనపు బొమ్మను ప్రదర్శనకు ఉంచారు. 2019లో సింగపూర్ లో మహేష్ బాబు మైనపు బొమ్మను లాంచ్ చేసారు. ఈ ఘనత పొందిన తొలి దక్షిణాది హీరోగా మహేష్ బాబు చరిత్ర సృష్టించారు.
కొత్త టెక్నాలజీని తెలుగు సినిమాకు పరిచయం చేసిన స్టార్
రీమేక్స్ చేయని సూపర్ స్టార్: మహేష్ బాబు ఇప్పటివరకు ఒక్క రీమేక్ కూడా చేయలేదు. హీరోగా మొదటి రాజకుమారుడు (1999) నుండి సర్కారు వారి పాట వరకూ అసలు రీమేక్ చేయనే లేదు. డాల్బీ ఎక్స్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ ని పరిచయం చేసిన హీరో: తండ్రి కృష్ణ మాదిరిగా మహేష్ బాబు కూడా తెలుగు సినిమాకు సాంకేతికతను పరిచయం చేసారు. తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం సినిమాతో డాల్బీ ఎక్స్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ ని తెలుగు సినిమాకు పరిచయం చేసారు. గుండె ఆపరేషన్లు: మహేష్ బాబు ఫౌండేషన్ పేరు మీద ఇప్పటికి వెయ్యి మందికి పైగా పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించారు.
మహేష్ బాబుకు తమిళ హీరో కార్తీ స్కూల్ మేట్
చిన్నప్పుడు చెన్నైలో ఉన్న మహేష్ బాబుకు తమిళ హీరో కార్తి, విజయ్ స్నేహితులు. కార్తి స్కూల్ మేట్ అయితే, విజయ్ తో ప్లే గ్రౌండ్ లో మహేష్ బాబు ఆటలు ఆడేవారట. మహేష్ బాబుకు తెలుగు చదవడం రాయడం రాదు. డైలాగ్స్ చెప్పేటపుడు దర్శకులతో చెప్పించుకుని ఆ తర్వాత వాటిని గుర్తుంచుకుని చెబుతారట. చెన్నైలో చదువుకున్న మహేష్ బాబుకు తమిళం కూడా రాదు. సెకండ్ లాగ్వేజ్ హిందీ కావడంతో తెలుగు, తమిళం రాయడం, చదవడం రాదు.