
Happy Birthday Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న హిట్టు సినిమాలివే
ఈ వార్తాకథనం ఏంటి
పవన్ కళ్యాణ్.. ఈ పేరు చెబితే అభిమానుల ఛాతి ఉప్పొంగుతుంది. పవన్ కళ్యాణ్ మాట వింటే అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమా తీస్తే రికార్డులతో బాక్సాఫీస్ బద్దలవుతుంది.
పవన్ కళ్యాణ్ తన కెరీర్లో ఎన్నో గొప్ప సినిమాలు చేసారు. తన 27సంవత్సరాల సినీ కెరీర్ లో 28సినిమాల్లో పవన్ కళ్యాణ్ కనిపించారు. సెప్టెంబర్ 2వ తేదీన పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలేంటో చూద్దాం.
అతడు, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, ఇడియట్, పోకిరి, నువ్వేకావాలి చిత్రాల కథలు మొదట పవన్ కళ్యాణ్ దగ్గరికే వచ్చాయి. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమాలను పవన్ వదులుకున్నారు.
Details
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు
ఒకవైపు హిట్టు సినిమాలను పవన్ కళ్యాణ్ వదిలేసుకున్నారు. మరోవైపు పవన్ చేయాల్సిన చాలా చిత్రాలు మధ్యలోనే ఆగిపోయాయి.
ఆ లిస్టులో మొదటగా సత్యాగ్రహి సినిమా వస్తుంది. జానీ తర్వాత ఈ సినిమాను రూపొందించాలి అనుకుని అనౌన్స్ చేసారు. కానీ అదెందుకో ఆగిపోయింది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో కోబలి సినిమా కూడా అలాగే ఆగిపోయింది. ప్రఖ్యాత దర్శకులు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రిన్స్ ఆఫ్ పీస్ సినిమా ప్రకటన వచ్చింది. కానీ ఆ తర్వాత దాని ఊసే వినపడలేదు.
దేశి అనే దేశభక్తి సినిమా అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఆ సినిమా పేరు వినపడలేదు. ఇంకా, వివి వినాయక్, జయంత్ సి పరాన్జీ దర్శకులతో చేయాల్సిన సినిమాలు కూడా ఆగిపోయాయి.