
Happy birthday Shriya Saran: శ్రియా కెరీర్లోని ఆసక్తికరమైన విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
శ్రియా శరణ్... తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా ఎక్కువరోజులు తెరమీద కనిపించిన నటి. ఒక్కపుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగింది.
ప్రస్తుతం ప్రాధాన్యమున్న పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈరోజు శ్రియా శరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె కెరీర్లోని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
శ్రియా శరణ్ 1982 సెప్టెంబర్ 11వ తేదిన హరిద్వార్ లో జన్మించింది. ఆమె తండ్రి బీహెచ్ఈఎల్ ఉద్యోగి, తల్లి కెమిస్ట్రీ టీచర్.
శ్రియా శరణ్ నిజానికి డ్యాన్సర్ కావాలనుకుంది. అందుకే కథక్ లో శిక్షణ కూడా తీసుకుంది. అయితే తిరక్తి క్యున్ హవా మ్యూజిక్ వీడియో కోసం రామోజీ ఫిలిమ్ సిటీ వచ్చినపుడు, ఆమెకు ఇష్టం(2001) సినిమా అవకాశం వచ్చింది.
Details
హాలీవుడ్ సినిమాల్లో శ్రియ
ఆ తర్వాత సంతోషం సినిమాతో శ్రియకు మంచి హిట్ దొరికింది. అప్పటి నుండి తెలుగులో ఆమెకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చ్చాయి.
2007లో రజనీకాంత్ నటించిన శివాజీ ది బాస్ సినిమాలో నటనకు ఆమెకు అవార్డు కూడా వచ్చింది.
కేవలం దక్షిణాది భాషల సినిమాల్లోనే కాకుండా, బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లోనూ శ్రియ నటించింది. 2008లో ద అదర్ ఎండ్ ఆఫ్ ద లైన్ అనే హాలీవుడ్ చిత్రంలో శ్రియ నటించింది. అలాగే కుకింగ్ విత్ స్టెల్లా సినిమాలోనూ శ్రియ మెరిసింది.
అటు సినిమాల్లోనే కాదు సమాజ సేవలోనూ శ్రియ ముందుంది. కంటిచూపు సమస్యలతో బాధపడేవారి కోసం శ్రీ స్పా పేరుతో ప్రత్యేక స్పా ని శ్రియ ఏర్పాటు చేసింది. ఇది ముంబయిలో ఉంది.
Details
రష్యన్ వ్యక్తిని పెళ్ళిచేసుకున్న శ్రియా శరణ్
శ్రియా శరణ్ 2018లో రష్యాకు చెందిన ఆండ్రెయ్ కొశ్చీవ్ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. చాలారోజులుగా తమ ప్రేమను బయటకు వెల్లడి చేయని శ్రియ, సడెన్ గా పెళ్ళితో అందరికీ షాకిచ్చింది.
ఇక శ్రియ భర్త ఆండ్రెయ్ కొశ్చీవ్, ప్రఖ్యాత టెన్నిస్ ప్లేయర్. రష్యా తరపున జాతీయ స్థాయిలో టెన్నిస్ ఆడాడు. అంతేకాదు ఆండ్రెయ్ కొశ్చీవ్ పలు వ్యాపారాలు కూడా చేస్తున్నాడు.