Hari Hara Veera Mallu: హరి హర వీర మల్లు నుండి అప్డేట్
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఆసక్తిగా ఎదురుచూసిన మొదటి పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు.ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు.
ఈ పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీను రెండు భాగాలుగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
ఈ చిత్రం నుండి చిత్ర యూనిట్ ఆసక్తికరమైన పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
పోస్ట్ లో ఈగల్, ఫైర్ సింబల్స్ కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాకి సంబందించిన టీజర్ ను గతంలో విడుదల చేయనున్నట్లు పలు వార్తలు వచ్చాయి.
Details
పోస్టర్ తో రిలీజ్ డేట్ ను ప్రకటించమంటున్న అభిమానులు
ఈ అప్డేట్ అదే అయ్యి ఉంటుంది అని అంతా భావిస్తున్నారు. అది కాకుండా పోస్టర్ తో రిలీజ్ డేట్ ను ప్రకటించండి అంటూ అభిమానులు కొంతమంది కోరుతున్నారు.
నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం లో బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మేకర్స్ చేసిన పోస్ట్ లో ఈగల్, ఫైర్ సింబల్స్
🦅🔥
— Hari Hara Veera Mallu (@HHVMFilm) April 30, 2024