LOADING...
Hari Hara Veeramallu: 'కొల్లగొట్టినాదిరో' 'హరిహర వీరమల్లు' నుంచి సాంగ్ రిలీజ్‌

Hari Hara Veeramallu: 'కొల్లగొట్టినాదిరో' 'హరిహర వీరమల్లు' నుంచి సాంగ్ రిలీజ్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 24, 2025
03:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే అభిమానులకు విపరీతమైన క్రేజ్. ఆయన నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన పీరియాడిక్ అడ్వెంచర్ యాక్షన్ మూవీ 'హరిహర వీరమల్లు'. ఈ చిత్రంలోని రెండో పాట 'కొల్లగొట్టినాదిరో..' ఫుల్ వర్షన్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ముందు రిలీజ్ చేసిన ప్రోమో ఇప్పటికే అభిమానులను ఆకట్టుకుంది. 'కొరకొర మీసాలతో.. కొదమ కొదమ అడుగులతో.. కొంటె కొంటె జనుగులతో..' అనే సాహిత్యంతో సాగిన ఈ పాట అభిమానుల మనసులను నిజంగానే కొల్లగొట్టేలా ఉంది. పాటకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ మీసం తిప్పుతూ స్టైల్‌గా చేసిన జానపద నృత్యం సినిమాపై మరింత హైప్‌ను పెంచేసింది.

వివరాలు 

'మాట వినాలి' పాట పాడిన పవన్ కల్యాణ్

ఈ పాటలో పవన్‌తో పాటు అనసూయ, పూజిత పొన్నాడ కూడా డాన్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చంద్రబోస్ ఈ పాటకు సాహిత్యం అందించగా, మంగ్లీ ఆలపించారు. అలాగే, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామిని ఘంటసాల కూడా ఈ పాటలో తమ గాత్రాన్ని అందించారు. 'హరిహర వీరమల్లు' సినిమాకు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించగా, నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించగా, మొదటి భాగాన్ని 'స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో విడుదల చేయనున్నారు. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన తొలి పాట 'మాట వినాలి' ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన పొందింది. ఈ పాటను పవన్ కల్యాణ్ స్వయంగా ఆలపించడం విశేషం.

వివరాలు 

మార్చి 28న విడుదల

'హరిహర వీరమల్లు'చిత్రం క్రిష్ జాగర్లమూడి,జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. అయితే, మొదటి భాగానికి క్రిష్ దాదాపుగా దర్శకత్వం వహించారు.కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో మిగిలిన పనిని నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ పూర్తి చేస్తున్నారు. ఇక రెండో భాగాన్ని పూర్తిగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించనున్నారు.ఈ చిత్రంలో బాబీ డియోల్,అనుపమ్ ఖేర్,నోరా ఫతేహి,విక్రమ్ జీత్,జిషుసేన్ గుప్తా వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను మార్చి 28న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. తాజాగా విడుదలైన పాటలు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్