
హరిహర వీరమల్లు: పండగ పూట పవన్ కళ్యాణ్ అభిమానులకు నిరాశ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం తెలుగు సినిమా అభిమానుల చూపులన్నీ హరిహర వీరమల్లు సినిమా మీదే ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ప్రయత్నించని జోనర్ లో సినిమా వస్తుండడంతో ఆసక్తి బాగా పెరిగింది.
ఆల్రెడీ రిలీజైన పవర్ గ్లింప్స్, చిన్నపాటి టీజర్ లో కనిపించిన పవన్ కళ్యాణ్ లుక్స్, సినిమా మీద అంచనాలను మరింత పెంచేసాయి.
దాంతో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. మార్చ్ 30వ తేదీన సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించారు కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తే, ఈ సినిమా ఇప్పట్లో రిలీజ్ అయ్యేలా కనిపించట్లేదు.
మార్చిలో రిలీజ్ అవ్వాలంటే ఈపాటికే షూటింగ్ పూర్తి కావాలి. కానీ ఇంకా చిత్రీకరణ కొనసాగుతూనే ఉందని సమాచారం.
పవన్ కళ్యాణ్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీజర్ వస్తుందని ప్రచారాలు
పీరియాడిక్ మూవీ కాబట్టి గ్రాఫిక్స్ పనులకు చాలా టైమ్ పడుతుంది. సో, మేకర్స్ మరో డేట్ రిలీజ్ చేస్తారని అనుకుంటున్నారు.
ఇదిలా ఉంటే జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా హరిహర వీరమల్లు నుండి టీజర్ వస్తుందని సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి.
కాకపోతే అది అసాధ్యమని కొందరు నెటిజన్లు భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రచారాల్లో భాగంగా మొన్నటివరకు కీరవాణి అమెరికాలోనే ఉన్నారు.
ఈ మధ్యే ఇండియాకి వచ్చినా కూడా టీజర్ కి మ్యూజిక్ చేయడానికి ఈ కాస్త సమయం సరిపోదని, దానివల్ల టీజర్ వచ్చే అవకాశమే లేదని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే రిపబ్లిక్ డే రోజున టీజర్ వస్తుందనుకుంటున్న పవన్ అభిమానులకు నిరాశే మిగిలుతుంది.