Pawan Kalyan-Harish Shankar: ఉస్తాద్ భగత్ సింగ్ పై .. హరీష్ శంకర్ అప్డేట్
ఈ వార్తాకథనం ఏంటి
పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టడంతో, ఆయన సినిమాలకు డేట్స్ ఇవ్వడానికి సమయం లేకుండా పోయింది.
అందువల్ల, ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం పవన్ చేతిలో హరిహర వీరమల్లు, OG, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి.
హరిహర వీరమల్లు ఈ సమ్మర్ లో విడుదల కావడం ఖాయం. కానీ, OG కోసం ఫ్యాన్స్ మరింత ఎదురు చూస్తున్నారు.
ఇక, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అందరూ ఎప్పుడో మర్చిపోయారు.పవన్ కళ్యాణ్ ఇందులో నటిస్తారని ఎవరికీ నమ్మకం లేదు.
అయితే,డైరెక్టర్ హరీష్ శంకర్, నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా ఉందనే అంటున్నారు.
వివరాలు
రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ప్రీ-రిలోడ్ ఈవెంట్
ఇప్పటి వరకు, సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. తాజాగా, ఒక సినిమా ఈవెంట్లో హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని ఓ ముఖ్యమైన సీన్ గురించి పంచుకున్నారు.
"లవ్ టుడే" ఫేమ్ ప్రదీప్ రంగనాధన్ "రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్" సినిమాతో రాబోతున్నాడు.
ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ ద్వారా తెలుగులో విడుదల కానుంది.
ఇటీవల,ఈ సినిమా ప్రీ-రిలోడ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ ఈవెంట్ కు హరీష్ శంకర్ గెస్ట్ గా హాజరయ్యారు.
వివరాలు
సినిమాలో ఆ సీన్ రీ క్రియేట్
అయితే, "రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్" సినిమా డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ,"అయనతో సినిమా చేయాలనుకుంటున్నాను.ఆయన రియల్ లైఫ్ లో కార్ మీద కూర్చొని వెళ్లిన సీన్ చూసి నేను షాక్ అయ్యాను.ఆ మాస్ సీన్ ఆయనతో సినిమా రీ క్రియేట్ చేయాలని" అన్నారు.
ఈ విషయంపై హరీష్ శంకర్ స్పందిస్తూ,"నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ అని అందరికి తెలిసిందే.ఆయనతో నేను చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఆ కార్ సీన్ ఇప్పటికే రాసుకున్నాను.రియల్ లైఫ్ లో పవన్ గారు కార్ మీద కూర్చొని వెళ్లే సీన్ ఇది.ఈ సీన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఉంటుంది" అన్నారు.
వివరాలు
సంతోషంగా ఫీల్ అవుతున్న పవన్ ఫ్యాన్స్
దీంతో, పవన్ ఫ్యాన్స్ సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఆ సీన్ టీవీ, యూట్యూబ్ లలో చూసినవాళ్లంతా షాక్ అయిపోతున్నారు.
ఇక, అదే సీన్ 70mm స్క్రీన్ మీద పవన్ కార్ మీద కూర్చొని, మాస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో చూస్తే అదిరిపోతుందని, అది మరింత ఎలివేషన్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
హరీష్ శంకర్ మరోసారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై మాట్లాడడంతో, ఈ సినిమా లేట్ అయినా కూడా ప్రేక్షకులు దీన్ని చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.