
దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ 2023: ఆర్ఆర్ఆర్ కి ఆ విభాగంలో చోటు
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశ సినిమా రంగంలో అత్యున్నత పురస్కారంగా పిలవబడే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను నిన్న ప్రకటించారు. 2023 సంవత్సరానికి ఏయే సినిమాలు, ఎవరెవరు నటులు ఈ అవార్డు అందుకున్నారో ఇక్కడ తెలుసుకుందాం.
ఉత్తమ చిత్రం : కాశ్మీర్ ఫైల్స్
ఉత్తమ నటుడు: రణ్ బీర్ కపూర్ (బ్రహ్మాస్త్ర)
ఉత్తమ నటి: ఆలియా భట్ (గంగూభాయి కథియావాడి)
విమర్శకులను మెప్పించిన ఉత్తమ నటుడు: వరుణ్ ధావన్ (బేడియా)
విమర్శకులను మెప్పించిన ఉత్తమ నటి: విద్యాబాలన్ (జల్సా)
ఉత్తమ దర్శకుడు : ఆర్ బాల్కీ(చుప్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: పీఎస్ వినోద్ (విక్రమ్ వేద)
మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్: రిషబ్ శెట్టి (కాంతార)
ఉత్తమ సహనాయకుడు : మనీష్ పాల్ (జుగ్ జుగ్ జీయో)
ఆర్ఆర్ఆర్
ఆర్ఆర్ఆర్ కి దక్కిన అవార్డు
ఫిలిమ్ ఆఫ్ ద ఇయర్ విభాగంలో ఆర్ఆర్ఆర్ అవార్డు దక్కించుకుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్, ఇక్కడ ఒకే అవార్డు గెలుచుకుంది.
సినిమా పరిశ్రమకు ఎన్నో ఏళ్ళుగా సేవలందించినందుకు గాను, బాలీవుడ్ సీనియర్ నటి రేఖ, అవార్డు అందుకున్నారు.
సంగీతంలో సేవలందించినందుకుగాను హరిహరన్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.
బెస్ట్ వర్సటైల్ యాక్టర్: అనుపమ్ ఖేర్
ఉత్తమ వెబ్ సిరీస్: రుద్ర
టెలివిజన్ సిరీస్ ఆఫ్ ద ఇయర్: అనుపమ
ఉత్తమ నేపథ్య గాయని: నీతి మోహన్(గంగూబాయి కథియావాడి)
ఉత్తమ నేపథ్య గాయకుడు: సాచెత్ తాండన్ (జెర్సీ)
టెలివిజన్ సిరీస్ లో ఉత్తమ నటుడు: జైన్ ఇమామ్
టెలివిజన్ సిరీస్ లో ఉత్తమ నటి: తేజస్వి ప్రకాష్ (నాగిన్).