SOUTH TOP HEROINE: దక్షిణాదిలో స్టార్ హీరోయిన్లు వీరే..టాప్ రెమ్యునరేషన్ ఎవరికో తెలుసా?
దక్షిణ భారత సినీ ఇండస్ట్రీ అంటే టాలీవుడ్, శాండల్ వుడ్, కోలీవుడ మాలీవుడ్ అని అందరికీ తెలిసిందే. ఆయా చిత్ర పరిశ్రమల నుంచి ఎందరో హీరోయిన్లుగా బాలీవుడ్ మార్కెట్‌తో పోటీ పడుతున్నారు. ఒకప్పుడు హీరో రెమ్యునరేషన్ లో కథనాయికది పావు వంతు మాత్రమే ఉండేది. రాను రాను హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు పెరగడం, వీరికి సైతం స్టార్ డమ్ పెరిగి లక్షలాది అభిమానులు తయారవుతున్నారు. ఈ నేపథ్యంలోనే హీరోయన్లు స్టార్లుగా మారుతున్నారు. పరిశ్రమలో అందనంత ఎత్తుకు ఎదుగుతున్నారు. ఈ క్రమంలోనే పారితోషికంలోనూ దూసుకెళ్తున్నారు. భారత చలనచిత్ర పరిశ్రమలో హీరో అయితే 60ఏళ్లు వచ్చినా వన్నెతగ్గని క్రేజ్, సినీ మార్కెట్‌తో దూసుకుపోతుంటారు. ఇద్దరు పిల్లలకు తండ్రి అయినా, తాత అయినా సినిమాల్లో మాత్రం హీరోనే.
తండ్రైనా, తాతైనా సరే హీరో హీరోనే
హీరోయిన్లు వయసు 40 ఏళ్లు దాటితో హీరోయిన్‌గా ఉండటం కష్టమనే చెప్పాలి. ఒకవేళ ఇండస్ట్రీలో ఉన్నా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సపోర్టింగ్ పాత్రలైన అమ్మ, వదిన, అక్క లాంటివి పోషించాల్సి వస్తుంది. మరో విషయం ఏంటంటే ఆయా హిరోయన్లు పెళ్లి చేసుకుంటే వారి సినిమా మార్కెట్ డమాల్ అవుతుందంతే. పెళ్లి, పిల్లల తర్వాత వారికి ఇచ్చే పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరోవైపు పలువురు హీరోయిన్లు మాత్రం కొన్నేళ్లుగా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హీరోయిన్లుగా తమ సత్తా చాటుతూనే ఉన్నారు. ఆ కోవలోనే స్టార్ నటీమణులు త్రిష, నయనతారలు నిలుస్తున్నారు.
ఈ ఇద్దరు హీరోయిన్లదే హవాే
ఈ ఇద్దరు హీరోయిన్లు గత 20 ఏళ్లకుపైగా కథానాయికలుగానే నటిస్తూ స్టార్ డమ్ సంపాదించారు. హై బడ్జెట్, పాన్ ఇండియన్ చిత్రాల్లోనూ ఈ హీరోయిన్లు, హీరోలతో సమానంగా పారితోషికం పొందుతూ రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఒక్కో సినిమాకు రూ. 10 నుంచి 11 కోట్ల వరకు అందుకుంటున్నట్లు టాక్. అయతే ఒక్క సినిమా చేస్తే రూ. 10 కోట్లకుపైగా రెమ్యునరేషన్ తీసుకున్న తొలి దక్షిణ భారతీయ నటిగా నయనతార చరిత్ర సృష్టించారు. మరోవైపు త్రిష తన నటనా ప్రావీణ్యంతో 40 ఏళ్లు దాటినా యూత్ ఫుల్ అందంతో మైమరపిస్తోంది.మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా త్రిష కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాకు గానూ త్రిష రూ.12 కోట్ల భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
టాప్ స్టార్లకు పోటీ ఇస్తున్న పూజా హెగ్డే
జవాన్ తో బాలీవుడ్ హీరోయిన్ గా మారిన నయనతార రూ.11 కోట్లను పారితోషికంగా తీసుకున్నట్లు సమాచారం. అనుష్క రూ.6 కోట్ల పారితోషికంతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. సమంత రూ.6 నుంచి 8 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. సౌత్ ఇండియన్ బిజీ నటీమణుల్లో ఒకరైన పూజా హెగ్డే సినిమాకు రూ. రెండున్నర నుంచి రూ.7 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని టాక్. రష్మిక మందన రూ. 4 నుంచి 7 కోట్లు మిల్కీ బ్యూటీ తమన్నా రూ. 3 కోట్ల నుంచి 5 కోట్లు కాజల్ అగర్వాల్ రూ. ఒకటిన్నర నుంచి నాలుగు కోట్లు రకుల్ ప్రీత్ సింగ్ రూ. 1.5 నుంచి 3.5 కోట్లు కీర్తి సురేష్ రూ.ే2.5 నుంచి 4 కోట్ల