Page Loader
హీరో నానికి మద్దతుగా రానా.. పాత్రికేయులే కాంట్ర‌వ‌ర్సీలు క్రియేట్ చేస్తారని చురకలు
పాత్రికేయులే కాంట్ర‌వ‌ర్సీలు క్రియేట్ చేస్తారని చురకలు

హీరో నానికి మద్దతుగా రానా.. పాత్రికేయులే కాంట్ర‌వ‌ర్సీలు క్రియేట్ చేస్తారని చురకలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 04, 2023
01:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

అల్లు అర్జున్ నటించిన పుష్పకు జాతీయ అవార్డు రావడంపై టాలీవుడ్ పరిశ్రమలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ మేరకు తెలుగు హీరోలు వరుసగా స్పందిస్తున్నారు. తాజాగా దగ్గుబాటి రానా సైతం ఇదే అంశంపై స్పందించారు. నాని పోస్టులో కాంట్ర‌వ‌ర్సీ ఏం లేద‌ని ఆయన చెప్పుకొచ్చాడు. సూర్య నటించిన జై భీమ్ చిత్రానికి జాతీయ అవార్డు రాక‌పోవ‌డం పట్ల హీరో నాని ఆవేదన వ్యక్తం చేశారు. అవార్డుల ప్రకటన తనను తీవ్ర నిరాశపర్చిందని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై నానికి సపోర్టుగా రానా రియాక్టు అయ్యాడు. పుష్ప సినిమాలో పుష్ప‌రాజ్‌గా న‌ట‌ించిన అల్లు అర్జున్ ఇటీవలే ఉత్తమ నటుడిగా నేష‌న‌ల్ అవార్డుకు ఎంపికయ్యారు.

DETAILS

నాని పోస్ట్‌తో టాలీవుడ్ లో మొదలైన ట్రోల్స్

స్మ‌గ్ల‌ర్ పాత్రకు జాతీయ అవార్డు ఇవ్వ‌డాన్ని కొంద‌రు సినీ ప్ర‌ముఖులు ట్రోల్ చేస్తున్నారు. నాని పోస్ట్‌తో అల్లు అర్జున్‌కు అవార్డు ఇవ్వ‌డంపై వ‌స్తోన్న‌ ట్రోల్స్ పై రానా స్పందించాడు. ఆదివారం సైమా అవార్డులకు సంబంధించి ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే అవార్డుల‌పై కాంట్ర‌వ‌ర్సీలేం లేవ‌ని, సినిమాల విష‌యంలో ఒక్కొక్క‌రికి ఒక్కో అభిప్రాయాలు, అభిరుచులు ఉంటాయన్నారు. అందరికీ అన్ని సినిమాలు న‌చ్చాల‌ని ఏం లేద‌ని, నటుల అభిరుచులకు తగ్గట్లే స్పందనలు ఉంటాయ‌న్నారు. ఫ‌లానా క‌థ‌కు అవార్డులు రావాల‌ని చాలా మంది కోరుకున్నారని, కానీ అవార్డు రాలేదన్నారు. బ‌న్నీకి అవార్డ్ ఎందుకొచ్చింద‌ని ఎవరు అనలేదన్నారు.నటులకు కాంట్ర‌వ‌ర్సీలు చేసే ఉద్దేశం ఉండదని, పాత్రికేయులే కాంట్ర‌వ‌ర్సీలు క్రియేట్ చేస్తారని పంచులు వేశారు.