Page Loader
Nagarjuna Family At Court : కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు.. కోర్టులో నాగార్జున ఫ్యామిలీ వాంగ్మూలం రికార్డ్
కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు.. కోర్టులో నాగార్జున ఫ్యామిలీ వాంగ్మూలం రికార్డ్

Nagarjuna Family At Court : కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు.. కోర్టులో నాగార్జున ఫ్యామిలీ వాంగ్మూలం రికార్డ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 08, 2024
06:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినీ నటుడు అక్కినేని నాగార్జున, మంత్రి కొండా సురేఖ మధ్య సాగుతున్న వివాదం క్రిమినల్ పరువు నష్టం దావా దాఖలు దిశగా వెళ్లింది. మంత్రి సురేఖ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తమ కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసినట్లుగా భావించి, నాగార్జున నాంపల్లి కోర్టులో ఈ కేసు వేసిన విషయం తెలిసిందే. ఇందులో ముఖ్యంగా నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా ఈ వివాదంపై నాగార్జున నాంపల్లి కోర్టులో తన వాంగ్మూలం ఇచ్చారు. మంత్రి సురేఖ వ్యాఖ్యలు తమ కుటుంబ ప్రతిష్టకు తీవ్ర నష్టం కలిగించాయని ఆయన కోర్టులో చెప్పారు.

Details

తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్న సురేఖ

ఆమె రాజకీయ ప్రయోజనాల కోసం నిరాధార ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. సురేఖ చేసిన వ్యాఖ్యలు అన్ని మీడియా వేదికల్లో ప్రసారం కావడం వల్ల తమ కుటుంబంపై తప్పుడు సంకేతాలు వెళ్లాయన్నారు. మంగళవారం హీరో నాగార్జున తన సతీమణి అమల, కుమారుడు నాగచైతన్యతో కలిసి కోర్టుకు వచ్చారు. కోర్టులో ఆయన తరపున సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసులో నాగార్జున వాంగ్మూలంతో పాటు మరికొందరు సాక్షుల వాంగ్మూలాలు కూడా కోర్టులో రికార్డు చేయాలని న్యాయవాది కోర్టును కోరారు ఇదంతా అక్టోబర్ 2న జరిగిన కొండా సురేఖ వ్యాఖ్యలతో మొదలైంది. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో మంత్రి సురేఖ తన మాటలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకుంది.