Page Loader
సూపర్ స్టార్ రజనీకాంత్‌ ఆశీర్వాదం తీసుకున్న లారెన్స్‌.. సెప్టెంబర్ 28న చంద్రముఖి-2 రిలీజ్
సెప్టెంబర్ 28న చంద్రముఖి-2 రిలీజ్

సూపర్ స్టార్ రజనీకాంత్‌ ఆశీర్వాదం తీసుకున్న లారెన్స్‌.. సెప్టెంబర్ 28న చంద్రముఖి-2 రిలీజ్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 26, 2023
02:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత చలనచిత్ర సూపర్ స్టార్‌, హీరో రజనీకాంత్‌ను ప్రముఖ దర్శకుడు, డాన్సర్ రాఘవ లారెన్స్‌ కలిశారు. అనంతరం గురువు గారు ఆశీర్వాదం అంటూ ఆయన పాదాలకు నమస్కరించారు. ఈ మేరకు ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. నా గురువు, తలైవా రజనీకాంత్‌ను కలిశాను. జైలర్‌ బ్లాక్ బస్టర్ అయినందుకు ఆయనకు అభినందనలు తెలిపేందుకు వచ్చినట్లు లారెన్స్ తెలిపారు. మరో 2 రోజుల్లో చంద్రముఖి-2 విడుదల సందర్భంగా ఆయన ఆశీర్వాదం తీసుకున్నట్లు వెల్లడించారు.ఇందుకు చాలా సంతోషంగా ఉందని, ఆయనో గొప్ప వ్యక్తని ట్వీట్‌ ద్వారా తెలిపారు. ఈ ఫొటోలు చూసిన తలైవా ఫ్యాన్స్ గురువుకు తగిన శిష్యుడని కామెంట్లు చేస్తున్నారు. చంద్రముఖి -2లో లారెన్స్‌, కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.కీరవాణి బాణీలు సమకూర్చారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గురువు రజినీకాంత్ ను కలిశానన్న రాఘన లారెన్స్