
తెలుగు సినిమాల్లో శ్రీకృష్ణుడిగా ప్రేక్షకులను అలరించిన హీరోలు వీళ్ళే
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినిమాల్లో శ్రీకృష్ణుడు అంటే అందరికీ గుర్తుకొచ్చేది సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే. కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ ని చూస్తే నిజంగా కృష్ణుడే దిగి వచ్చాడేమో అన్నట్లుగా ఉంటుంది.
ఈరోజు కృష్ణాష్టమి.. ఈ సందర్భంగా తెలుగు సినిమాల్లో కృష్ణుడిగా నటించిన హీరోలు ఎవరెవరున్నారో తెలుసుకుందాం.
సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా ఇద్దరు పెళ్ళాలు చిత్రంలో కృష్ణుడి గెటప్ లో కొద్దిసేపు కనిపించారు. ఆ తర్వాత మాయాబజార్ చిత్రంలో పూర్తి నిడివి గల శ్రీకృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ కనిపించారు.
అప్పటినుండి వరుసగా చాలా సినిమాల్లో శ్రీకృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ మెప్పించారు. ఆయన కెరీర్లో మొత్తం 18సినిమాల్లో శ్రీకృష్ణుడి వేషధారణలో కనిపించారు. ఇప్పటివరకు ఇదే రికార్డ్.
Details
శ్రీకృష్ణుడి పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు
సీనియర్ ఎన్టీఆర్ తర్వాత కాంతారావు శ్రీకృష్ణుడిగా చాలా సినిమాల్లో కనిపించారు. అక్కినేని నాగేశ్వరరావు మాత్రం గోవుల గోపన్న చిత్రంలో ఒక్కసారి మాత్రమే శ్రీకృష్ణుడి పాత్రలో కనిపించారు.
ఇక శోభన్ బాబు, బుద్ధిమంతుడు సినిమాలో శ్రీకృష్ణుడిగా మొదటిసారి నటించారు. ఆ తర్వాత కురుక్షేత్రం సినిమాలో కృష్ణుడిగా కనిపించారు.
నందమూరి వారసుడు బాలకృష్ణ, మంగమ్మగారి మనవడు, పట్టాభిషేకం, శ్రీకృష్ణార్జున విజయం, పాండురంగడు వంటి సినిమాల్లో శ్రీకృష్ణుడిగా కనిపించారు.
నట కిరీటి రాజేంద్రప్రసాద్, కన్నయ్య కిట్టయ్య చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్రలో మెప్పించారు. సూపర్ స్టార్ కృష్ణ సాక్షి చిత్రంలో మొదటిసారిగా శ్రీకృష్ణుడిగా కనిపించారు.
Details
శ్రీకృష్ణుడిగా అతిలోక సుందరి శ్రీదేవి
ఇటు నాగార్జున కృష్ణార్జున చిత్రంలో, పవన్ కళ్యాణ్ గోపాల గోపాల సినిమాల్లో కృష్ణుడి వేషధారణ లేకుండా శ్రీకృష్ణుడి పాత్రలో నటించారు.
అతిలోకసుందరి శ్రీదేవి, యశోద కృష్ణ సినిమాలో బాలకృష్ణుడిగా నటించారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు, యువరాజు చిత్రంలో శ్రీకృష్ణుడి అవతారంలో కొద్దిసేపు అలరించారు.