తదుపరి వార్తా కథనం

HI NANNA : మనసుని హత్తుకుంటున్న నాని 'హాయ్ నాన్న'.. తాజాగా కొత్త వీడియో రిలీజ్
వ్రాసిన వారు
TEJAVYAS BESTHA
Nov 15, 2023
04:11 pm
ఈ వార్తాకథనం ఏంటి
హీరో నాని, తండ్రి పాత్రలో నటించిన కుటుంబ కథ చిత్రం 'హాయ్ నాన్న' కు సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది.
ఈ మేరకు నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారి కియారాతో జరిగిన షూటింగ్ సన్నివేశాలను విడుదల అయ్యింది.
ఈ క్రమంలోనే హీరో నాని ట్విట్టర్ వేదికలో బేబీ కియారా ఖన్నాతో కలిసి ఉన్న వీడియోను పంచుకున్నారు.
మృణాల్ ఠాకూర్, నాని జంటగా రూపొందిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కీలక పాత్ర పోషిస్తోంది.
తండ్రీ కుమార్తెల సెంటిమెంట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి శౌర్యువ్ దర్శకత్వం వహించారు. సరదాగా సాగుతోన్న తండ్రీ కుమార్తెల జీవితంలోకి ఓ యువతి అతడితో ప్రేమలో పడటం లాంటి అనూహ్య సన్నివేశాలు ఈ మూవీలు ఉన్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బేబీ కియరాతో షూటింగ్ సీన్లు పంచుకున్న హాయ్ నాన్న
With my Mahi. Making memories ♥️#HiNannaOnDec7th pic.twitter.com/9ZqvUC6JIW
— Nani (@NameisNani) November 15, 2023