
Hi Nanna Review: హాయ్ నాన్న మూవీ రివ్యూ.. తండ్రీ కూతుళ్ల ఎమోషన్స్ మధ్య సాగే కథ
ఈ వార్తాకథనం ఏంటి
'దసరా' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత న్యాచురల్ స్టార్ నాని(Nani) చేసిన సినిమా 'హాయ్ నాన్న'(Hi Nanna).
కొత్త దర్శకుడు శౌర్వుత్ తెరకెక్కించిన ఈ మూవీ ఇవాళ విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందో లేదో తెలుసుకుందాం.
విరాజ్(నాని)కు తన కూతురు మహి(బేబీ కియారా) అంటే ప్రాణం. మహికి అరుదైన వ్యాధి కారణంగా పుట్టుక నుంచే ప్రాణాలతో పోరాడుతుంటుంది.
మరోవైపు మహి తన తల్లి గురించి తెలుసుకోవాలని ఆశ పడుతుంది.
విరాజ్ మాత్రం తన భార్య గురించి కూతురికి చెప్పడు.
అసలు విరాజ్ భార్య ఎవరు? ఆమె ఎందుకు వదిలేసి పోయింది? చివరికి కథ ఎలా ముగిసిందో తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.
Details
నాని నటన అద్భుతం
ఫీల్ గుడ్ ఫ్యామిలీ సీన్స్, ఎమోషనల్‌గా సాగే తండ్రీకూళుళ్ల ఎమోషన్స్‌ను డైరక్టర్ చక్కగా తీర్చిదిద్దాడు.
నాని నటన, మృణాల్ ఠాకూర్ పాత్ర, క్లైమాక్స్, లవ్ స్టోరీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి.
ఇక BGM, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయి. అతిథి పాత్రలో శృతి హాసన్, అలాగే తండ్రిగా జయరామ్ తమ నాచ్యురల్ నటనతో ఆకట్టుకున్నారు.
కొన్నిచోట్ల సాగదీత కథనం, రోటిన్ అనిపించే కొన్ని సీన్లు ఈ సినిమాకు మైనస్ గా నిలిచాయి.
ఓవరాల్‌గా ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుంది.