Hi Nanna : హాయ్ నాన్న నుంచి 'ఓడియమ్మా'.. లిరికల్ వీడియో రిలీజ్
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Nani) తండ్రి పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం 'హాయ్ నాన్న' (Hi Nanna) నుంచి మరో అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఈ క్రమంలోనే 'హాయ్ నాన్న' నుంచి నాని, శ్రుతి హాసన్‌లపై చిత్రీకరించిన 'ఓడియమ్మా' సాంగ్, లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. తండ్రీ కుమార్తెల కథాంశం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం, శౌర్యువ్ దర్శకత్వంలో రూపొందింది. యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), నాని జోడిగా ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ లక్ష్యంగా నిర్మిస్తున్నారు. బేబీ కియారా, శ్రుతిహాసన్ ముఖ్యపాత్రల్లో కనిపిందు చేయనున్నారు. డిసెంబర్ 7న హాయ్ నాన్న ప్రేక్షకుల ముందుకు రానుంది.