Hi Nanna Twitter Review: హాయ్ నాన్న ట్విట్టర్ రివ్యూ.. నాన్న సెంటిమెంట్ వర్కౌట్ అయిందా? నాని, మృణాల్ ఫర్ఫామెన్స్ అదుర్స్!
న్యాచురల్ స్టార్ నాని (Nani) దసరా బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత తన 30వ సినిమాగా 'హాయ్ నాన్న'(Hi Nanna)తో వచ్చాడు. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించాడు. నాని, మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో తెరకెక్కించిన హాయ్ నాన్న సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో విరాజ్ పాత్రలో (నాని) అద్భుతంగా నటించాడు. యష్ణ, వర్ష పాత్రాల్లో మృణాల్ ఒదిగిపోయింది. బేబి కియారా నటన హార్ట్‌ను టచ్ చేస్తుంది. ఇక దర్శకుడు శౌర్య రాసిన కథ, టేకింగ్ బాగా ఉంది. హేషమ్ మ్యూజిక్ గుర్తిండిపోతుంది. భావోద్వేగంతో ఉండే ప్రతీ తండ్రి విరాజ్ పాత్రకు కనెక్ట్ అవుతాడు.
నాని, మృణాల్, బేబి కియారా నటన అద్భుతం
ఈ కథలో భావోద్వేగాలు, మలుపులు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. నాని, మృణాల్, బేబి కియారా నటన ఈ సినిమాను అదనపు ప్లస్‌గా నిలిచింది. నిదానంలో సాగే ప్రథమార్థంతో కొంత ప్రేక్షకులు ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. ఇక సాంగ్స్ మాత్రం పెద్దగా ఆకట్టుకోవు. సినిమా అంతా ముంబై, గోవా, కూనూర్ లోనే తీయడంతో అందమైన లొకేషన్స్ చాలా ఉంటాయి.