Devara: 'దేవర' టికెట్ల పెంపుపై హైకోర్టు కీలక నిర్ణయం
ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం 'దేవర' టికెట్ ధరల పెంపుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టికెట్ ధరలను 14 రోజులుగా కాకుండా 10 రోజులకు మాత్రమే పెంచుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. 'దేవర' చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. నిర్మాతలు ప్రత్యేక రేట్ల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిని స్వీకరించిన ప్రభుత్వం 14 రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకోవచ్చని పేర్కొన్నారు.
టికెట్ ధర విషయంలో నియంత్రణ పాటించాలి
మొదటి రోజు 6 షోలు, తరువాత 9 రోజుల పాటు 5 షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఈ నిర్ణయంపై పిటిషన్ దాఖలు కావడంతో హైకోర్టు విచారణ చేపట్టింది. టికెట్ ధరలను 14 రోజులకు పెంచడం తగదని, 10 రోజులకు మాత్రమే పరిమితం చేయాలని కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల విషయంలో కొంత నియంత్రణ పాటించాలని పేర్కొంది.