తదుపరి వార్తా కథనం
Mohan Babu : హైకోర్టు నిరాకరణ.. బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 06, 2025
11:31 am
ఈ వార్తాకథనం ఏంటి
జర్నలిస్టుపై దాడి కేసులో సినీ నటుడు మోహన్ బాబు సుప్రీంకోర్టుకు వెళ్లారు.
ఇటీవల జరిగిన హైకోర్టు విచారణలో మోహన్ బాబుకు బెయిల్ నిరాకరించారు. దీంతో ఆయన ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై సుప్రీంకోర్టు ఏమనేది త్వరలో తెలుసుకోవాల్సి ఉంది. ఇటీవల మోహన్ బాబు కుటుంబంలో తీవ్ర విభేదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
మోహన్ బాబు, మంచు విష్ణు ఒకవైపు, మంచు మనోజ్ మరోవైపు వివాదాలు చెలరేగాయి.
Details
హైకోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరణ
ఈ తరుణంలో మోహన్ బాబు నివాసం వద్ద మీడియా ప్రతినిధులతో ఉన్న సమయంలో జర్నలిస్టుపై దాడి చేశారు.
ఈ దాడిని జర్నలిస్ట్ సంఘాలు, ఇతరులు తీవ్రంగా ఖండించారు.
దాంతో మోహన్ బాబు మీద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆయన హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా, అది తిరస్కరించారు. ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.