Holi Special Songs : టాలీవుడ్ సినిమాలలోని ఈ హోలీ పాటలు వింటే డ్యాన్స్ చేయకుండా ఉండలేం..
ఈ వార్తాకథనం ఏంటి
హోలీ పండగ అంటే పిల్లలు, పెద్దలు అందరికీ సరదానే! దేశమంతటా రంగుల హోలీ ఉత్సవాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
జనాలు రంగుల్లో మునిగిపోయి ఆనందోత్సాహంతో హోలీని జరుపుకుంటున్నారు.
ఈ పండుగకు ఓ విశేషమైన చరిత్ర ఉంది. సత్యయుగం నుండి హిందూ పురాణాల్లో హోలీ ప్రస్తావన ఉందని చెబుతారు.
అందరిలో ఉత్సాహాన్ని నింపే ఈ పండుగ రోజున, మరింత ఉల్లాసాన్ని కలిగించే కొన్ని తెలుగు హోలీ పాటలను గురించి తెలుసుకుందామా?
వివరాలు
తెలుగు సినిమాలలో హోలీ పాటలు
ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం రూపొందించిన, కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వచ్చిన 'నాయకుడు' చిత్రం ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలోని'సందెపొద్దు మేఘం పూలజల్లు కురిసెను నేడు' అనే హోలీ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది.ఇప్పటికీ ఈ పాట హోలీ స్పెషల్‌గా వినిపిస్తుంటుంది.
జూనియర్ ఎన్టీఆర్, ఇలియానా, ఛార్మి నటించిన ఎమోషనల్ మూవీ 'రాఖీ'లోని 'రంగు రబ్బా రబ్బా అంటోంది రంగ్ బర్సే'అనే హోలీ పాటకు విశేషమైన స్పందన లభించింది. ఈ పాటలో తారక్ ఎనర్జీ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఇప్పటికీ హోలీ స్పెషల్ సాంగ్‌లలో ఇదొకటిగా గుర్తింపు పొందింది.
నాగార్జున హీరోగా నటించిన'మాస్' చిత్రంలోని 'రంగు తీసి కొట్టు'పాట హోలీ వాతావరణాన్ని అద్భుతంగా ప్రతిబింబించింది.ఈ పాట ఇప్పటికీ హోలీ స్పెషల్‌గా గుర్తుండిపోయింది.
వివరాలు
తెలుగు సినిమాలలో హోలీ పాటలు
వెంకటేష్, నమిత జంటగా నటించిన 'జెమిని' సినిమాలోని 'దిల్ దివానా.. మై హసీనా..' పాట కూడా హోలీ పండుగతో ముడిపడినదే. ఈ పాట ఇప్పటికీ ఎవరిగ్రీన్ హోలీ సాంగ్‌లలో ఒకటిగా నిలిచింది.
అంతేకాదు, చిరంజీవి, ప్రభాస్ సినిమాల్లో కూడా హోలీ స్పెషల్ పాటలు ఉన్నాయి.
ఎన్నో తెలుగు పాటలు హోలీ ప్రత్యేకతను చాటుతున్నాయి. ఈ హోలీ సందర్బంగా ఈ పాటలను ఒక్కసారి వినేయ్యండి, మరింత ఉత్సాహంగా పండుగను ఆస్వాదించండి!