Honey Teaser: రిచువల్-ఆధారిత సైకలాజికల్ హారర్ మూవీ నవీన్ చంద్ర 'హనీ' టీజర్
ఈ వార్తాకథనం ఏంటి
నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో, కరుణ కుమార్ రచన, దర్శకత్వంలో రూపొందిన సైకలాజికల్ హారర్ చిత్రం 'హనీ'. OVA ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది. నిజజీవిత ఘటనల నుంచి ప్రేరణ పొందిన ఈ సినిమా, మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకలాజికల్ అంశాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల ఈ సినిమాకు టీజర్ విడుదల అయ్యింది, ఇది వెన్నులో వణుకులు రేపే విధంగా ప్రేక్షకుల ఉత్కంఠను పెంచింది.
వివరాలు
ఏదో పెద్ద రహస్యం దాగి ఉంది
ఇప్పటివరకు మనం చూసిన హారర్ సినిమాలతో పోలిస్తే 'హనీ' టీజర్ పూర్తిగా రిచువల్-ఆధారిత హారర్‌గా ఉంటుంది. నిశ్శబ్దం, చీకటి, మర్మమైన చూపులు, తెలియని శక్తులు అన్ని కలిసి ఒక రహస్యభరిత, మర్మమైన ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నాయి. టీజర్ ద్వారా, దర్శకుడు కరుణ కుమార్ ఇంతకుముందు ఎప్పుడూ చూడని కథని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హారర్‌ను కేవలం భయపెట్టే అంశంగా కాకుండా, ఊహకు మించి ప్రజెంట్ చేసిన విధానం అభిమానుల ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రతి ఫ్రేమ్‌లోనూ "ఏదో పెద్ద రహస్యం దాగి ఉంది" అనే ఫీలింగ్ స్పష్టంగా ఉంది.
వివరాలు
గూస్ బంప్స్ తెప్పిస్తున్న అజయ్ అరసాడ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
నవీన్ చంద్ర లుక్, పెర్ఫార్మెన్స్-స్టన్నింగ్ గా ఉన్నాయి. దివ్య, రాజా రవీంద్ర పాత్రలు కూడా ప్రత్యేకంగా చూపించారు. అజయ్ అరసాడ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ప్రేక్షకులకి గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ చిత్రానికి మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, నాగేష్ బానెల్ సినిమాటోగ్రఫీతో టాప్-లెవెల్ టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. సైకలాజికల్ లోతు, సోషల్ రిలవెన్స్, హారర్ అంశాల సమ్మేళనంతో 'హనీ' ఫిబ్రవరి 6న ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్
#Honey interesting teaser cut👌💥💥💥#NaveenChandra #HoneyMovie
— Narendra News (@Narendra4News) January 20, 2026
Feb 6th release
pic.twitter.com/ri8JhoCzzB