Rajinikanth: రజనీకాంత్ గౌరవార్థం.. వందేళ్ల పత్రిక భారీ సర్‌ప్రైజ్
ఈ వార్తాకథనం ఏంటి
అగ్రనటుడు రజనీకాంత్ మరోసారి అరుదైన గుర్తింపును అందుకున్నారు. ప్రముఖ ఆంగ్ల పత్రిక హిందుస్థాన్ టైమ్స్ ఫ్రంట్ పేజీలో ఆయన ఫొటోను ముద్రించారు. ఈ పత్రికకు వందేళ్ల చరిత్ర ఉన్నప్పటికీ,ఒక నటుడి చిత్రంతో పేజీ మొత్తాన్ని అంకితం చేయడం ఇదే తొలిసారి. సినీప్రపంచంలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా,హిందుస్థాన్ టైమ్స్ అతనిపై తన అభిమానాన్ని ఈ ప్రత్యేక రూపంలో వ్యక్తపరిచింది. సినిమా ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసిన వ్యక్తికి ఇంత పెద్ద గౌరవం ఇవ్వడం తమకు సంతోషంగా ఉందని పత్రిక తెలిపింది. నవంబర్ 19న వెలువడిన పేపర్‌లో రజనీ పూర్తి పేజీ ఫొటో చూసిన పాఠకులు ఆశ్చర్యంతోపాటు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇది ఆయనకు లభించిన అత్యున్నత గౌరవాలలో ఒకటిగా వారు భావించారు.
వివరాలు
ఐఎఫ్ఎఫ్‌ఐ - 2025లో రజనీకాంత్‌కు ప్రత్యేక సన్మానం
ఈ సర్‌ప్రైజ్‌పై రజనీకాంత్ కూడా స్పందిస్తూ, ఇలాంటి అపూర్వమైన గౌరవానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అభిమానులు చూపుతున్న ప్రేమ, ఆదరణ తన మనసును మరింత ఆనందంతో నింపిందని చెప్పారు. 1975లో వచ్చిన 'అపూర్వ రాగంగళ్' తో సినీ రంగప్రవేశం చేసిన రజనీకాంత్.. ఆ తరువాత విభిన్న శైలి, అద్భుతమైన నటనతో ఎన్నో బ్లాక్‌బస్టర్లు అందుకున్నారు. కోట్లాది మందికి ప్రియమైన తలైవాగా ఎదిగారు. ఈ నెలలో గోవాలో జరగనున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్‌ఐ - 2025) ముగింపు కార్యక్రమంలో రజనీకాంత్‌ను ప్రత్యేకంగా సత్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వందేళ్ల పత్రిక భారీ సర్‌ప్రైజ్
The prestigious Hindustan times is turning into RAJINIKANT times for a day ! Only thalaiva can pull this off. 🔥🔥#RajinikanthTimes pic.twitter.com/cnNNCfatGq
— NewsNowNation (@NewsNowNation) November 19, 2025