Salman Khan: శ్రద్ధా సినిమాతో పోటీ వద్దనుకున్నా.. అనుకోకుండా క్లాష్ అయింది: సల్మాన్ ఖాన్
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన 'మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్' సినిమా విడుదలకు సిద్ధమైంది. ఎన్నో వాయిదాల అనంతరం డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అదే రోజున బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటించిన 'ఈథా' కూడా విడుదల కానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాల మధ్య పోటీ నెలకొననుంది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రద్ధా సినిమా విడుదల తేదీ గురించి ముందే తెలిసి ఉంటే.. తన చిత్రాన్ని అదే రోజున విడుదలకు ఎంచుకునేవాడిని కాదని వెల్లడించారు.
వివరాలు
విడుదల తేదీ ఖరారులో ఎన్నో మార్పులు
ఇటీవల ఏబీపీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ తన సినిమా విడుదల తేదీని ఖరారు చేయడంలో ఎదురైన ఇబ్బందుల గురించి మాట్లాడారు.
'మొదట నవంబర్ 20న సినిమాను విడుదల చేయాలని భావించాం. అయితే వీఎఫ్ఎక్స్ పనుల్లో కొన్ని లోపాలు గుర్తించడంతో వాయిదా వేయాల్సి వచ్చింది.
ఆ తర్వాత నవంబర్ 27న విడుదల చేయాలనుకున్నాం. కానీ అదే రోజున సూరజ్ బర్జాత్యా సినిమా 'యే ప్రేమ్ మోల్ లియా' విడుదలవుతుండటంతో వెనక్కి తగ్గాం.
సూరజ్‌తో నేను ఎప్పటికీ బాక్సాఫీస్ పోటీకి దిగను. అలాగే సన్నీ డియోల్ సినిమా విడుదల కూడా ఉండటంతో ఆయనతోనూ పోటీ పడకూడదని నిర్ణయించుకున్నా. డిసెంబర్ 24న షారుఖ్ ఖాన్, సుహానాల 'కింగ్' విడుదల కానుంది.
వివరాలు
శ్రద్ధాకు ఫోన్ చేసి క్షమాపణ చెప్పిన సల్మాన్
షారుఖ్‌తో కూడా ఎప్పటికీ పోటీకి దిగను. అంతర్జాతీయ చిత్రాలైన 'అవెంజర్స్: డూమ్స్‌డే', 'డ్యూన్' వంటి సినిమాలతో పోటీ ఉన్నా నాకు ఇబ్బంది లేదు.
కానీ షారుఖ్ ఖాన్‌తో మాత్రం బాక్సాఫీస్ క్లాష్ ఉండకూడదు' అని సల్మాన్ వివరించారు. శ్రద్ధా కపూర్ నటించిన 'ఈథా' కూడా డిసెంబర్ 4నే విడుదలవుతుండటంపై సల్మాన్ ఖాన్ విచారం వ్యక్తం చేశారు.
ఈ విషయం తనకు ముందుగా తెలియదని, తెలిసి ఉంటే ఆ తేదీని ఎంచుకునేవాడిని కాదని చెప్పారు. 'ఈ విషయం నాకు ముందుగా తెలియదు.
తెలిసి ఉంటే శ్రద్ధా సినిమాతో పోటీకి వచ్చేవాడిని కాదు. ఇప్పటికే ఆమెకు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పాను. శ్రద్ధా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు.
వివరాలు
శ్రద్ధాపై చిత్రాంగద సింగ్ ప్రశంసలు
ఆమెకు ఫోన్ చేసి.. ఈ విషయం నాకు తెలియదు, నిజంగా క్షమించు అని చెప్పాను.
అందుకు ఆమె.. రెండు సినిమాలూ విడుదల కావడానికి తగినంత స్థలం ఉంది సర్ అని సమాధానమిచ్చింది.
అది విని చాలా సంతోషించాను. ప్రేక్షకులు శ్రద్ధా సినిమాను కూడా థియేటర్లలో చూడాలని సల్మాన్ కోరారు.
ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి చిత్రాంగద సింగ్ కూడా శ్రద్ధా కపూర్‌పై ప్రశంసలు కురిపించారు. శ్రద్ధా అద్భుతమైన నటి అని, ఇప్పటికే తన నటనతో ఎన్నోసార్లు ఆ విషయాన్ని నిరూపించుకుందని అన్నారు.
'మాతృభూమి', 'ఈథా' రెండూ మంచి సినిమాలేనని పేర్కొన్న చిత్రాంగద సింగ్.. ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి రెండు చిత్రాలనూ ఆదరించాలని కోరారు.