LOADING...
Mehreen Pirzada: 'నేను ఎవరినీ పెళ్లి చేసుకోలేదు'.. వదంతులపై మెహరీన్ అగ్రహం
నేను ఎవరినీ పెళ్లి చేసుకోలేదు'.. వదంతులపై మెహరీన్ అగ్రహం

Mehreen Pirzada: 'నేను ఎవరినీ పెళ్లి చేసుకోలేదు'.. వదంతులపై మెహరీన్ అగ్రహం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 16, 2025
11:38 am

ఈ వార్తాకథనం ఏంటి

తన పెళ్లిపై ఓ మీడియా సంస్థ చేసిన వార్తపై నటి మెహరీన్ పిర్జాదా అసహనం వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాలు ఇలాంటి వదంతులపై మౌనంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు తన మనసులో ఉన్న మాట చెప్పక తప్పడం లేదని ఆమె తెలిపారు. 'ఓ వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నట్లు వార్త రాశారు. అతడితో నాకు పరిచయం కూడా లేదు. నేను ఎవరినీ వివాహం చేసుకోలేదు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ విషయాన్ని ప్రపంచానికి ప్రకటిస్తాను. నన్ను నమ్మండి'' అని మెహరీన్ స్పష్టంగా పేర్కొన్నారు. తన పెళ్లి గురించి వదంతులు వ్యాప్తి చేయకూడదని కోరారు.

Details

గతంలో పెళ్లి రద్దు అయింది

మెహరీన్ గతంలో హరియాణాకు చెందిన భవ్యా బిష్ణోయ్‌తో నిశ్చితార్థం చేసుకున్నా, అనివార్య కారణాల వల్ల పెళ్లి రద్దయిందని చెప్పడం గమనార్హం. 2022లో విడుదలైన 'ఎఫ్‌3' తర్వాత తెలుగు సినిమా 'స్పార్క్'లో నటించారు. కోలీవుడ్‌లో 'ఇంద్ర'లో ఒకే సినిమా నటించారు. ప్రస్తుతం కన్నడంలో ఓ కొత్త చిత్రంలో నటిస్తున్నారు. కెరీర్‌లో గ్యాప్‌పై ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ గ్యాప్ కావాలని తీసుకోలేదు. 'ఎఫ్‌3' తర్వాత 'సుల్తాన్ ఆఫ్ దిల్లీ' వెబ్ సిరీస్ కోసం ఎక్కువ సమయం కేటాయించానని పేర్కొన్నారు.

Advertisement