
Rajinikanth:'వేట్టయన్' కథలో మార్పులు చేయమని నేనే సూచించా: రజనీకాంత్
ఈ వార్తాకథనం ఏంటి
రజనీకాంత్ నటించిన 'వేట్టయన్' చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 10న విడుదల కానుంది. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
రజనీకాంత్ ఇటీవల ఈ సినిమా కథ గురించి ఓ సందర్భంలో చెప్పిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రజనీకాంత్ వెల్లడించిన వివరాల ప్రకారం, మొదట జ్ఞానవేల్ తీసుకువచ్చిన కథపై రజనీ కొన్ని మార్పులను సూచించారు.
'జైభీమ్' సినిమాతో జ్ఞానవేల్ ఎంతో ప్రభావం చూపించాడు. కానీ ఈ సినిమాను కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపితే ప్రేక్షకులకు మరింత ఆకర్షణీయంగా ఉంటుందని భావించి, మార్పులు చేయమని చెప్పామని రజనీ పేర్కొన్నారు.
Details
రిటైర్డ్ పోలీసు అధికారిగా కనిపించనున్నరజనీకాంత్
జ్ఞానవేల్ 10 రోజుల సమయం తీసుకుని కథను మార్పులు చేసి తిరిగి రాగా, రజనీకాంత్ చాలా సంతోషంగా ఆమోదించినట్లు తెలిపారు.
ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా ఉండాలని జ్ఞానవేల్ పట్టుబట్టిన విషయాన్ని రజనీ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
రజనీకాంత్ ఇందులో రిటైర్డ్ పోలీసు అధికారిగా కనిపించనున్నారని సమాచారం.
అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా, రితికా సింగ్, మంజు వారియర్, దుషారా విజయన్ వంటి ప్రముఖులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. 'వేట్టయన్' తెలుగులోనూ అదే పేరుతో విడుదల కానుంది.