Brahmanandam: నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు.. దయన్నను అవమానించలేదు : బ్రహ్మనందం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతున్నారు. ఇటీవల మోహన్ బాబు 50 ఏళ్ల సినీ ప్రస్థానం సందర్భంగా జరిగిన వేడుకకు ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపట్ల బ్రహ్మానందం అనుచితంగా ప్రవర్తించాడని, అవమానించినట్టుగా వ్యవహరించాడని కొందరు సోషల్ మీడియాలో ఆరోపణలు పెడుతూ పోస్టులు షేర్ చేశారు. దీంతో సంబంధిత వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వివాదంపై తాజాగా స్వయంగా బ్రహ్మానందం క్లారిటీ ఇచ్చారు. వీడియో విడుదల చేసిన ఆయన మాట్లాడుతూ, "నాది, దయాకర్ రావు గారిది ముప్పై ఏళ్ల స్నేహం. మేము ఒక కుటుంబ సభ్యుల్లా కలుసుకుంటూ ఉంటాం. మా మధ్య చనువు చాలా ఉంది.
Details
కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు
మొన్న ఈవెంట్‌లో ఆయన 'ఫోటో తీసుకుందాం' అని అన్నారు. కానీ ఆలస్యం అవుతుందని అనుకుని నేను 'వద్దు' అన్నట్లుగా వెళ్లిపోయాను. అంతే అక్కడ జరిగినది. అందులో ఏమాత్రం దురుద్దేశం లేదు. కానీ కొందరు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ వీడియో వైరల్ అవుతుండడం చూసి నాకు నవ్వు వచ్చింది. దయన్నకు కూడా ఫోన్ చేసి ఇద్దరం చిరునవ్వులు చిందించుకున్నాం. ఆ వీడియోపై స్పష్టత ఇవ్వాలని, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దని ఈ వివరణ ఇస్తున్నానని బ్రహ్మానందం తెలిపారు.