Page Loader
Anupama Parameshwaran : నాకు యాక్టింగ్ రాదంటూ ట్రోల్స్ చేశారు : అనుపమ ఎమోషనల్ కామెంట్స్ 
నాకు యాక్టింగ్ రాదంటూ ట్రోల్స్ చేశారు : అనుపమ ఎమోషనల్ కామెంట్స్

Anupama Parameshwaran : నాకు యాక్టింగ్ రాదంటూ ట్రోల్స్ చేశారు : అనుపమ ఎమోషనల్ కామెంట్స్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 17, 2025
04:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

మళయాళ సుందరి అనుపమ పరమేశ్వరన్‌కు యువతలో విశేషమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె నటన, అందం, డ్యాన్స్‌ పరంగా తనకే ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఆమె నటనను విమర్శిస్తూ ట్రోలింగ్ చేసిన వారున్నారని, అలాంటి కామెంట్లు మొదటి రోజుల్లో ఎక్కువగా ఎదురయ్యాయని అనుపమ తానే వెల్లడించింది. నేను ఇండస్ట్రీలోకి వచ్చిందప్పుడే ఇలాంటి ట్రోల్స్‌ను ఎక్కువగా చూశాను. కేవలం సోషల్ మీడియాలో కాదు, ఇండస్ట్రీలో కూడా నాకు యాక్టింగ్ రాదంటూ కామెంట్లు వచ్చాయి. నిజంగానే నా మీద నాకే అనుమానం వచ్చేది.నటించలేను అనిపించి బాధపడ్డ రోజులు ఉన్నాయంటూ అనుపమ చెప్పింది. అయితే ఆ సమయంలో దర్శకుడు ప్రవీణ్ నన్ను నమ్మారని, 'జానకి వర్సెస్ కేరళ' సినిమాలో ఛాన్స్ ఇచ్చినప్పుడే తనలో నమ్మకం వచ్చిందని చెప్పింది.

Details

ట్రోల్ చేసినవారే అభిమానులు అయ్యారు

ఆ చిత్రంతో ఆమెకు మంచి ప్రశంసలు లభించాయి. ప్రేక్షకులకు నచ్చే కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తే ట్రోల్స్‌ను పట్టించుకోవాల్సిన అవసరం ఉండదని అప్పుడు అర్థమైంది. అప్పటి నుంచి మంచి కథలున్న సినిమాలపై దృష్టి పెట్టాను. ఒకప్పుడు నన్ను ట్రోల్ చేసినవారే ఇప్పుడు నా అభిమానులయ్యారని అనుపమ తెలిపింది. సినిమాల పరంగా నన్ను నేను చాలా మెరుగుపరుచుకున్నాను. ఇప్పటి వరకు చేయని రకాల పాత్రలు ఇప్పుడే చేయగలుగుతున్నా. గ్లామర్ కంటే నటనకు అవకాశం ఉన్న పాత్రలపైనే ఆసక్తి పెరిగింది. అలాంటి పాత్రలే నన్ను ఇండస్ట్రీలో నిలబెట్టగలవు. అందరూ గ్లామర్ పాత్రలు చేస్తారు. కానీ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తేనే అసలైన గుర్తింపు వస్తుందని అనుపమ పరమేశ్వరన్‌ పేర్కొంది