LOADING...
iBomma: మళ్లీ ఐబొమ్మ యాక్టివ్ అయ్యింది.. టాలీవుడ్‌లో మళ్లీ ఆందోళన
మళ్లీ ఐబొమ్మ యాక్టివ్ అయ్యింది.. టాలీవుడ్‌లో మళ్లీ ఆందోళన

iBomma: మళ్లీ ఐబొమ్మ యాక్టివ్ అయ్యింది.. టాలీవుడ్‌లో మళ్లీ ఆందోళన

వ్రాసిన వారు Moogati Shabari
May 13, 2026
03:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌ను మరోసారి కలవరపరిచే పరిణామం చోటుచేసుకుంది. కొన్నేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద సమస్యగా మారిన పైరసీ వెబ్‌సైట్ 'ఐబొమ్మ' మళ్లీ తిరిగి కార్యకలాపాలు ప్రారంభించడంతో పరిశ్రమలో టెన్షన్ నెలకొంది. ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న వ్యక్తిగా భావిస్తున్న ఐబొమ్మ రవి ఇటీవల అరెస్ట్ కావడంతో పైరసీకి పెద్దగా అడ్డుకట్ట పడినట్లు అందరూ భావించారు. దీంతో సినీ వర్గాలు కొంత ఊపిరి పీల్చుకున్నాయి.

వివరాలు

మళ్లీ యాక్టివ్ అయిన సైట్..

అయితే, కొన్ని నెలల క్రితం సైబరాబాద్ పోలీసులు కీలక సూత్రధారి రవిని అరెస్ట్ చేసిన తర్వాత పరిస్థితి మారింది. కానీ ఆయనకు బెయిల్ రావడంతో కొద్దిరోజుల్లోనే ఐబొమ్మ సైట్ మళ్లీ యాక్టివ్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలు మాత్రమే కాకుండా, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో విడుదలైన కొత్త కంటెంట్ కూడా డొమైన్లు మార్చుకుంటూ ఐబొమ్మలో అప్‌లోడ్ అవుతున్నట్లు తెలుస్తోంది.

వివరాలు

అంతర్జాతీయ స్థాయి నెట్‌వర్క్ ఉందా?

పోలీసుల పర్యవేక్షణలో ఉన్న సమయంలోనే సైట్ మళ్లీ ప్రారంభం కావడం మరింత అనుమానాలకు దారితీస్తోంది. దీని వెనుక అంతర్జాతీయ స్థాయి నెట్‌వర్క్ ఉందా? లేదా వేరే సర్వర్ల ద్వారా దీనిని నడుపుతున్నారా? అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సైట్ తిరిగి యాక్టివ్ కావడానికి రవే కారణమా లేక ఇంకెవరో దీన్ని నిర్వహిస్తున్నారా అన్నది ఇంకా స్పష్టతకు రావాల్సి ఉంది.

Advertisement