Page Loader
Kiran Abbavaram: నిరూపిస్తే సినిమాలను మానేస్తాను : కిరణ్ అబ్బవరం
నిరూపిస్తే సినిమాలను మానేస్తాను : కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram: నిరూపిస్తే సినిమాలను మానేస్తాను : కిరణ్ అబ్బవరం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 26, 2024
03:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'క' (KA) దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. సుజిత్, సందీప్ దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో తన్వీ రామ్ కథానాయికగా నటించింది. మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో కిరణ్ ఈ సినిమాపై ఎంతో విశ్వాసంతో ఉన్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో కిరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కథ వినూత్నంగా ఉంటుందని, ఇలాంటి కాన్సెప్ట్‌తో గతంలో ఎలాంటి సినిమా రాలేదని ధీమా వ్యక్తం చేశారు.

Details

'క' సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది

ఒకవేళ గతంలో ఇలాంటి సినిమా ఉందని నిరూపిస్తే, సినిమాలు మానేస్తానని ధైర్యంగా ప్రకటించారు. కన్నడ, తమిళం, మలయాళం వంటి భాషల్లో కూడా విడుదల కానున్న ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో అమితమైన ఆసక్తి నెలకొంది. కిరణ్ అబ్బవరం ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ద్వారా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనున్నట్లు ట్రైలర్, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ల ద్వారా అర్థమవుతోంది.