Ilaiyaraaja: 'ఇళయరాజా'బయోపిక్ షూటింగ్ ప్రారంభం
మ్యూజిక్ మాస్ట్రో 'ఇళయరాజా' బయోపిక్ షూటింగ్ ఈ రోజు (బుధవారం)లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమా ప్రారంభానికి కమల్ హాసన్ ముఖ్య అతిధిగా విచ్చేసి టైటిల్ పోస్టర్ లాంచ్ చేసారు. సినిమా లాంచ్ అనంతరం ధనుష్ మాట్లాడుతూ.. ఇళయరాజా సర్ బయోపిక్ చేస్తునందుకు గర్వంగా ఉంది. నేను లైఫ్ లో ఇద్దరి బయోపిక్ లు తీయాలని అనుకున్నాను. ఒకటి ఇళయరాజా సర్, రెండు సూపర్ స్టార్ రజినీకాంత్ అని తెలిపారు. ఈ సినిమాలో తమిళ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించనుండగా.. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమా తమిళ, తెలుగు, కన్నడ మలయాళం ,హిందీ బాషలలో రిలీజ్ కానుంది.