ILayaRaja-Rajani Kanth-Coolie: రజనీకాంత్ కూలీ సినిమాకు నోటీసులు పంపించిన ఇళయరాజా
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajani Kanth), సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ రాజ్ కాంబినేషన్ లో రూపొందుతున్న కూలీ (Coolie) సినిమాకు టీం కు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా(ILayaRaja) ఝలక్కిచ్చారు. ఆ సినిమాలో తన ట్యూన్లను కాపీ చేశారని ఆరోపిస్తూ ఆ సినిమా యూనిట్‌కు ఇళయరాజా నోటీసులు జారీ చేశారు. కూలీ సినిమాకు సంబంధించి ఇటీవలే రిలీజైన ట్రైలర్ లో ర జనీకాంత్ బంగారం స్మగ్లింగ్ డెన్ లోకి అడుగుపెట్టి అక్కడ చేసిన ఫైట్ ఆడియన్స్‌ను ఒక రేంజ్‌లో ఊపేస్తోంది. ఈ ట్రైలర్‌లో రెండు పాటలున్నాయి. 'నినైతలై ఇనికుం' సినిమాలోని 'శంభో శివ శంభో' పాట సాహిత్యాన్ని,'తంగమగన్' సినిమాలోని 'వావా పభ వా' పాటకు నేపథ్య సంగీతాన్ని జోడించారు.
ఎస్పీబీ కు ఇళయరాజాకు వివాదం
ఈవీడియోలో తన నేపథ్య సంగీతాన్ని అనుమతిలేకుండా తిరిగి వాడుకున్నందుకు గాను సంగీత దర్శకుడుఇళయరాజా సన్ పిక్చర్స్ కునోటీసులు పంపించారు. దీంతో కూలీ చిత్రయూనిట్ ఇబ్బంది పడింది.''పాటలన్నీస్వరకర్త సొంతం.వారు కంపోజ్ చేసిన పాటల్ని వాడుకోవాలంటే అనుమతి తీసుకుని వాటికి కాపీ రైట్ చెల్లించి వాడుకోవచ్చు. అనుమతి లేకుండా వేదికలపై ప్రదర్శించడ గానీ,ఇతర సినిమాల్లో ఉపయోగించడం గానీ చేయకూడదు. అనుమతి తీసుకుని వాటికి కాపీ రైట్ చెల్లించి మాత్రమే వాడుకోవాలి''అని ఇళయరాజా ఎప్పట్నుంచో చెబుతున్నారు. గతంలో ఇదే విషయంపై గాయకుడు ఎస్పీబీ కు ఇళయరాజాకు వివాదం నడిచింది. తాజాగా అనిరుద్ స్వరపరిచిన ట్రైలర్‌లో మ్యూజిక్ ను తొలగించాలని లేదా కాపీ రైట్ చెల్లించి వాడుకోవచ్చని ఇళయరాజా కూలీ ఫిల్మ్ యూనిట్ కు నోటీసులు జారీ చేశారు.