LOADING...
Inca Awards: ఐఎన్‌సీఏ అవార్డుల వేడుక.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య
ఐఎన్‌సీఏ అవార్డుల వేడుక.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య

Inca Awards: ఐఎన్‌సీఏ అవార్డుల వేడుక.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య

వ్రాసిన వారు Moogati Shabari
Apr 17, 2026
11:18 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ నేషనల్ సినిమా అకాడమీ (ఐఎన్‌సీఏ) అవార్డుల 2026 ప్రదానోత్సవం గురువారం రాత్రి అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముంబయి ఆతిథ్యం ఇచ్చింది. దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ఉద్దేశంతో నిర్వహించిన ఈ వేడుకలో అనేక మంది సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, ఇతర ఇండస్ట్రీల నుంచి సెలబ్రిటీలు తరలివచ్చారు.

వివరాలు

అనిల్ రావిపూడికి అవార్డు..

టాలీవుడ్ నటుడు రానా, నటి శ్రియ, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. టాలీవుడ్ తరఫున ఉత్తమ నటుడి పురస్కారం నాగచైతన్యకు లభించింది. 'తండేల్' చిత్రంలో ఆయన చేసిన నటనకు గుర్తింపుగా ఈ అవార్డు అందుకున్నారు. అలాగే 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకు అనిల్ రావిపూడి ఉత్తమ దర్శకుడిగా ఎంపిక కాగా, మాస్టర్ రేవంత్ ఉత్తమ హాస్యనటుడిగా అవార్డు అందుకున్నారు.

Advertisement