LOADING...
Ravichandran Ashwin: భారత మహిళల జట్టు విజయం స్ఫూర్తిదాయకం.. ఇది గత వరల్డ్‌కప్‌ల కంటే గొప్పది : అశ్విన్
భారత మహిళల జట్టు విజయం స్ఫూర్తిదాయకం.. ఇది గత వరల్డ్‌కప్‌ల కంటే గొప్పది : అశ్విన్

Ravichandran Ashwin: భారత మహిళల జట్టు విజయం స్ఫూర్తిదాయకం.. ఇది గత వరల్డ్‌కప్‌ల కంటే గొప్పది : అశ్విన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 04, 2025
09:12 am

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టీమిండియా విశ్వవిజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. గతంలో 2005, 2017ల్లో ఫైనల్‌ దశలో ఓటమి ఎదుర్కొన్న భారత జట్టు, చివరికి 2025లో ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంపై టీమిండియా మాజీ క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా స్పందించారు. భారత మహిళల జట్టు ప్రపంచ కప్‌ గెలిచిన తర్వాత ట్రోఫీని మిథాలీ రాజ్‌ చేతుల్లో పెట్టడం చాలా గొప్ప నిర్ణయం. దీని కోసం నేను టీమ్‌ఇండియాను అభినందిస్తున్నా.

Details

భావోద్వేగానికి లోనైన అంజుమ్ చోప్రా, మిథాలీ రాజ్

భారత పురుషుల జట్టు ఇంతవరకు ఇలాంటి విషయం ఎప్పుడూ చేయలేదు. మేము చాలా సార్లు మీడియా ముందు మాట్లాడుతుంటాం 'ఆ వ్యక్తి అలా చేశాడు', 'ఇతను బాగాడు', 'మా తరం జట్టు గొప్పది', 'మీ తరం అంతగా కాదు' అంటూ. కానీ గత తరం కృషికి గుర్తింపు ఇవ్వడం చాలా అరుదుగా జరుగుతుందని అశ్విన్‌ వ్యాఖ్యానించాడు. అశ్విన్‌ ఇంకా వివరిస్తూ అంజుమ్‌ చోప్రా, మిథాలీ రాజ్‌లకు ట్రోఫీ అందించడం మహిళల జట్టు చేసిన గొప్ప పని. వారిద్దరూ భావోద్వేగానికి లోనయ్యారు, ఆనందంతో మునిగిపోయారు. .

Details

ఈ విజయం ఒక్కరోజులో రాలేదు

ఈ విజయం ఒక్క రోజులో రాలేదు. ఇది 25 సంవత్సరాల కృషి, పట్టుదల, త్యాగాల ఫలితమని విశ్లేషించాడు. అలాగే భారత మహిళల ఈ వరల్డ్‌కప్‌ విజయం, గతంలో సాధించిన పురుషుల వరల్డ్‌కప్‌లకంటే గొప్పది. ఎందుకంటే ఈ విజయం అనేక మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనే ధైర్యం, ప్రేరణ ఈ విజయంతో పెరుగుతుందని రవిచంద్రన్‌ అశ్విన్‌ పేర్కొన్నాడు