#InternationalYogaDay: అంతర్జాతీయ యోగా దినోత్సవం.. వేడుకల్లో సినీ తారల సందడి
ఈ వార్తాకథనం ఏంటి
12వ ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో సినీ ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులు యోగా ప్రాధాన్యాన్ని వివరిస్తూ తమ సందేశాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ముంబైలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌తో పాటు కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయా పాల్గొన్నారు. 'ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా' అనే అంశాన్ని ప్రధానంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న అక్షయ్ కుమార్ వీడియో..
#Delhi: Union Minister Mansukh Mandaviya and Bollywood actor Akshay Kumar perform yoga asanas alongside thousands of participants during the International Day of Yoga celebrations. #InternationalYogaDay #IDY2026 @mansukhmandviya @akshaykumar pic.twitter.com/ljwWY4EsTu
— SansadTV (@sansad_tv) June 21, 2026
వివరాలు
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం యోాగా..
ఇండియన్ యోగా అసోసియేషన్ అంబాసిడర్, నటుడు విద్యుత్ జమ్వాల్ కూడా ఓ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ, తల్లిదండ్రులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపితేనే పిల్లలు కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేందుకు ప్రేరణ పొందుతారని పేర్కొన్నారు. హరియాణాలోని గురుగ్రామ్‌లో జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమంలో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి పాల్గొన్నారు. ఇదే సందర్భంగా టాలీవుడ్ నటి శ్రీలీలా మాట్లాడుతూ, ప్రస్తుత జీవన విధానంలో ఒత్తిడి అనేది సహజమైన అంశంగా మారిందని అన్నారు. అలాంటి పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ఎంతో అవసరమని సూచించారు. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో..
Haryana: Actress Shilpa Shetty perform Yoga on the 12th annual International Day of Yoga in Gurugram.
— SansadTV (@sansad_tv) June 21, 2026
The theme for this year's Yoga Day is 'Yoga For Healthy Ageing'@TheShilpaShetty #अंतर्राष्ट्रीय_योग_दिवस #InternationalYogaDay #IDY2026 #YogaDay2026 #YogaForHealthyAgeing pic.twitter.com/6Ei1UXtmGb