Page Loader
Arshad Warsi: భారత్ కంటే ఆప్గాన్ సురక్షితమేమో.. అర్షద్ వార్సీ ట్వీట్ వైరల్!
భారత్ కంటే ఆప్గాన్ సురక్షితమేమో.. అర్షద్ వార్సీ ట్వీట్ వైరల్!

Arshad Warsi: భారత్ కంటే ఆప్గాన్ సురక్షితమేమో.. అర్షద్ వార్సీ ట్వీట్ వైరల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 24, 2024
09:44 am

ఈ వార్తాకథనం ఏంటి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. కల్కి సినిమాలో ప్రభాస్ జోకర్‌లాగా ఉన్నారని అర్షద్ వార్సీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ అంశంపై మూవీ అర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఖండిస్తూ లేఖ రాసింది. టాలీవుడ్ ప్రముఖులు కూడా అర్షద్ వార్సీ వ్యాఖ్యలను ఖండించారు. ఈ నేపథ్యంలో 2012లో అర్షద్ వార్సీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది

Details

అఫ్గాన్ షిఫ్ట్ అయిపో అంటూ కామెంట్

రేపు ఉదయం అఫ్గాన్ అధ్యక్షుడిని కలుస్తానని, తాను ఆ దేశానికి షిప్ట్ అయితే బెటరేమోనని, భారత్ కంటే అక్కడి సురక్షితమని ట్వీట్‌లో రాసుకొచ్చారు. దీంతో అర్జెంట్‌గా అఫ్గాన్ షిప్ట్ అయిపోతే బాగుంటుందని నెటిజన్లు కామెంట్లు పడుతున్నారు. ఈ వ్యవహరంపై అర్షద్ వార్సీని సినీ అభిమానులు వదలడం లేదు.