Loading...
Varanasi Movie: వారణాసి విడుదల తేదీ మారనుందా? రామాయణ 2 స్థానంలోకి మహేశ్ బాబు సినిమా!
వారణాసి విడుదల తేదీ మారనుందా? రామాయణ 2 స్థానంలోకి మహేశ్ బాబు సినిమా!

Varanasi Movie: వారణాసి విడుదల తేదీ మారనుందా? రామాయణ 2 స్థానంలోకి మహేశ్ బాబు సినిమా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 13, 2026
11:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ సినిమా నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించి తెరకెక్కిస్తున్న భారీ చిత్రాల గురించి మాట్లాడుకుంటే.. వారణాసి, రామాయణ సినిమాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. అంతర్జాతీయ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని ఐమ్యాక్స్ వెర్షన్‌లో రూపొందిస్తున్న ఈ రెండు చిత్రాలపై ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రామాయణ తొలి భాగం విడుదల కాగా.. ఇప్పుడు అందరి దృష్టి దర్శకధీరుడు రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న వారణాసిపైనే ఉంది.

వివరాలు

వారణాసి వాయిదా పడుతుందా?

వారణాసి విడుదల తేదీని ఇప్పటికే ఏప్రిల్ 7గా ఖరారు చేశారు. అయితే రాజమౌళి సినిమాలకు రికార్డులు, విడుదల తేదీల మార్పులు కొత్తేమీ కాదు.

ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా వారణాసి వాయిదా పడుతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

తాజాగా మరో ఆసక్తికరమైన ప్రచారం తెరపైకి వచ్చింది. రామాయణ పార్ట్ 2 విడుదల కావాల్సిన స్లాట్‌లోకి వారణాసి వెళ్లనుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి.

వివరాలు

2028 దీపావళికి రామాయణ 2

నిజానికి రామాయణ పార్ట్ 2ను మేకర్స్ వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయాలని తొలుత నిర్ణయించారు. అయితే ఇటీవల పార్ట్ 1 విడుదలైన నేపథ్యంలో రెండో భాగం విడుదలను మరో ఏడాదికి వాయిదా వేసినట్లు ప్రకటించారు.

దీంతో రామాయణ 2ను 2028 దీపావళికి విడుదల చేయనున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన ఆ విడుదల స్లాట్‌ను వారణాసి భర్తీ చేయనుందనే ప్రచారం మొదలైంది.

అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. మేకర్స్ దీనిపై ఏదైనా అధికారిక ప్రకటన చేసి వారణాసి విడుదల తేదీని ఖరారు చేస్తారో లేదో చూడాలి.

అప్పటివరకు ఈ వాయిదా వార్తలను ప్రచారంగానే పరిగణించాలి.

ADVERTISEMENT