LOADING...
Prakash Raj: 'మతాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం తప్పు'.. ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్
మతాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం తప్పు'.. ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్

Prakash Raj: 'మతాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం తప్పు'.. ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 02, 2024
01:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

'జస్ట్‌ ఆస్కింగ్‌' పేరుతో సమకాలీన అంశాలపై తన అభిప్రాయాలను నటుడు ప్రకాష్ రాజ్ వ్యక్తం చేస్తుంటాడు. ఇటీవల తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణల నేపథ్యంలో వరుసగా ట్వీట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా మతం, రాజకీయాలపై ఆయన 'ఎక్స్' వేదికగా చేసిన పోస్టులు చర్చనీయాంశంగా మారాయి. మహాత్మా గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకొని, ప్రకాష్ రాజ్ వారి సూక్తులు, సందేశాలను నెటిజన్లతో పంచుకున్నారు. ఒకవేళ నువ్వు మైనారిటీలో భాగమైనప్పటికీ, నిజం ఎప్పటికీ నిజమే అన్న మహాత్మా గాంధీ సూక్తిని గుర్తు చేశారు.

Details

నిజాలను అర్థం చేసుకోవాలి

అలాగే దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలు మనకు ఉన్నాయని, కానీ వాటిని రాజకీయాల్లోకి తీసుకురావద్దన్నారు. ఇదే మనకు, పాకిస్థాన్‌కు ఉన్న తేడా అని లాల్ బహదూర్ శాస్త్రి చేసిన వ్యాఖ్యలను ప్రకాశ్ రాజ్ పంచుకున్నారు. అందరికీ గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి శుభాకాంక్షలని, ఇకనైనా ఈ నిజాన్ని బలంగా అర్థం చేసుకోవాలని ప్రకాశ్ రాజ్ తెలిపారు. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై ప్రకాశ్ రాజ్ స్పందించిన విషయం తెలిసిందే.

Details

ప్రజల కోసం పని చేయండి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది అని, విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోవాలని, ఎందుకు అనవసర భయాలు కల్పిస్తారని పేర్కొన్నారు. దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలని, ఆయన పోస్టు పెట్టారు. ప్రకాశ్ రాజ్ తాజా ట్వీట్లో ఇక చాలు... ప్రజల కోసం చేయాల్సిన పనులను చూడండి అంటూ ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై ఎవరు స్పందిస్తారో వేచి చూడాలి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రకాశ్ రాజ్ తాజా ట్వీట్