Page Loader
Sukumar: సుకుమార్‌ ఇంట్లో ఐటీ దాడులు..కీలక పత్రాల కోసం అన్వేషణ
సుకుమార్‌ ఇంట్లో ఐటీ దాడులు..కీలక పత్రాల కోసం అన్వేషణ

Sukumar: సుకుమార్‌ ఇంట్లో ఐటీ దాడులు..కీలక పత్రాల కోసం అన్వేషణ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 22, 2025
12:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల వరుస దాడులు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవలే ప్రముఖ నిర్మాత తెలంగాణ చలనచిత్ర సమాఖ్య అభివృద్ధి సంస్థ ఛైర్మన్ దిల్ రాజు ఇళ్లలో, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడులు తెల్లవారుజాము నుంచే ప్రారంభమయ్యాయి. రెండోరోజు కూడా హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఈ దాడులు ముమ్మరంగా కొనసాగాయి. ముఖ్యంగా బంజారాహిల్స్‌, జూబ్లీ హిల్స్‌, కొండాపూర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి ప్రాంతాల్లో మొత్తం ఎనిమిది చోట్ల ఐటీ సోదాలు నిర్వహించడం ప్రాధాన్యత పొందింది. ఈ సోదాలు మొదట శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో ప్రారంభమయ్యాయి. ఆపై మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థలపై విస్తరించాయి.

Details

సుక్కు

తాజాగా పుష్ప 2 చిత్ర దర్శకుడు సుకుమార్ కూడా ఐటీ అధికారుల దృష్టిలో పడ్డాడు. ఆయన నివాసం కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. పుష్ప 2 సినిమాకు సుకుమార్ తీసుకున్న రూ.15 కోట్లు రెమ్యునరేషన్‌తో పాటు, ఆయన ఆదాయ వనరులపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఆయనను ఎయిర్‌పోర్ట్‌లోనే అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాలపై జరిగిన సోదాల్లో అధికారులు కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇక పుష్ప 2 చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. ఆయన రెమ్యునరేషన్‌పై ఆదాయపు పన్నులు చెల్లించారా లేదా అనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ వరుస దాడులు టాలీవుడ్‌లో కలకలం సృష్టిస్తున్నాయి.