
టైగర్ నాగేశ్వరరావు సినిమా నిర్మాత ఆఫీసుపై ఐటీ అధికారుల సోదాలు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. గతంలో చిట్ ఫండ్ వ్యాపారాలు, రాజకీయ నేతల ఇళ్లపై ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే.
తాజాగా సినిమా నిర్మాత ఆఫీసుల్లో ఐటీ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. రవితేజ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఆఫీసులో ఐటీ సోదాలు జరుగుతున్నాయని సమాచారం.
టైగర్ నాగేశ్వరరావు చిత్రం మరికొద్ది రోజుల్లో రిలీజ్ అవుతుందనగా నిర్మాత ఆఫీసులో ఐటీ సోదాలు జరగడం సంచలనంగా మారింది. ప్రస్తుతానికి ఈ విషయంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
Details
ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని నిర్మించిన అభిషేక్ అగర్వాల్
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ లో అనేక సినిమాలను అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఇండియాలో సంచలనం రేపిన 'ది కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమాకు ఒకానొక నిర్మాతగా అభిషేక్ అగర్వాల్ ఉన్నారు.
ఇప్పుడు రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని రూపొందించారు. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని కొత్త దర్శకుడు వంశీ తెరకెక్కించారు.
టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. అక్టోబర్ 19వ తేదీన టైగర్ నాగేశ్వరరావు చిత్రం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్లలో బాగా బిజీగా ఉంది.