
Jabardasth-Getup Srinu-Raju Yadav: రాజు యాదవ్ వెండితెరపై నవ్వులు పూయించేనా?..వచ్చేవారమే విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
జబర్దస్త్ కామెడీ షో మెంబర్ గెటప్ శ్రీను టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అతడిని హీరోగా పెట్టి తీసిన సినిమా రాజు యాదవ్.
నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
కొత్త దర్శకుడు కృష్ణమాచారి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
ఈనెల 17న రాజు యాదవ్ సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు .
ఈ క్రమంలో థియేట్రికల్ ట్రైలర్ ని సూపర్ హీరో తేజ సజ్జ ఆవిష్కరించారు.
ఈ ట్రైలర్ కు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన లభిస్తోంది.
క్రికెట్ గ్రౌండ్ లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు బంతి తగలడంతో తన ముఖ కండరాలను కదిలించలేక పోతాడు రాజు యాదవ్.
Raju Yadav
నవ్వులు పూయిస్తున్న ట్రైలర్
దాంతో అతని ఎల్లప్పుడూ చిరునవ్వుతోనే కనిపిస్తాడు.
జీవితంలో జరిగిన ఈ విషాదానికి దారి తీసిన సంఘటనలతోనే ఈ ట్రైలర్ ప్రారంభమైంది.
ట్రైలర్లో గెటప్ శీను లుక్ నవ్వులు పూయిస్తుంది.
గెటప్ శీను కి జోడిగా అంకిత ఖరత్ నటించారు.
ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.
కాగా బొబ్బిలి సురేష్ నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు.
ఫుల్ కామెడీ లెంగ్త్ అండర్టైనర్ గా రూపొందిస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.