Page Loader
Jacqueline Fernandez :బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అపార్టుమెంట్ లో మంటలు 
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అపార్టుమెంట్ లో మంటలు

Jacqueline Fernandez :బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అపార్టుమెంట్ లో మంటలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 07, 2024
11:24 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నివసించే భవనంలో మంటలు చెలరేగినట్లు వార్తలు వచ్చాయి. భవనంలో మంటలు చెలరేగిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.ఈ భవనంలోని 15వ అంతస్తులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇల్లు ఉంది. అందిన సమాచారం ప్రకారం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 14వ అంతస్తు కింది అంతస్తులో మంటలు చెలరేగాయి. బయట నుంచి చూసిన కొంతమంది ఫైర్ ఇంజిన్ కి కాల్ చేయడంతో 4 ఫైర్ ఇంజిన్స్ అక్కడికి చేరుకొని మంటలను ఆర్పాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం.అయితే జాక్వెలిన్ కి ఏమైనా అయిందా అంటూ అభిమానులు,నెటిజన్లు ఆరా తీయడంతో ఈ ఫైర్ యాక్సిడెంట్ వైరల్ గా మారింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ భయాన్ని చేసిన ట్వీట్